హీరో, యమహా మరియు టీవీఎస్ టూ వీలర్ల రిజిస్ట్రేషన్‌కు నిరాకరిస్తున్న తమిళనాడు ఆర్‌టిఓలు

బిఎస్-III వాహనాల బ్యాన్ అనంతరం ఇండియన్ టూ వీలర్ల మార్కెట్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కుంది. దానికి ఇప్పుడు మరొకటి వచ్చి చేరింది. తమిళనాడులో కొత్త బిఎస్-IV టూ వీలర్ల రిజిస్ట్రేషన్‌ను ఆర్‌టిఓలో నిలిపివేశాయి

By Anil

నిజమా...! అని ఆశ్చర్యపోతున్నారా..? నిజమే తమిళనాడులోని ఆర్‌టిఓలు కొత్త యమహా, హీరో మరియు టీవీఎస్ టూ వీలర్ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేశాయి. దీనికి కారణం ఏంటో తెలుసా...? దీనికి కూడా ఆ భారత్ స్టేజ్ ఉద్గార నియమాలే అని తెలియడంతో ద్విచక్ర వాహన కొనుగోలుదారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి వెనకున్న అసలు కారణాలేంటో చూద్దాం రండి...

టూ వీలర్ల రిజిస్ట్రేషన్‌ నిలిపేసిన తమిళనాడు ఆర్‌టిఓలు

తమిళనాడులోని రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలు నూతన యమహా, హీరో మరియు టీవీఎస్ టూ వీలర్లను ఏప్రిల్ 17, 2017 నుండి రిజిస్ట్రేషన్లను నిలిపివేశాయి.

టూ వీలర్ల రిజిస్ట్రేషన్‌ నిలిపేసిన తమిళనాడు ఆర్‌టిఓలు

బిస్-III మరియు బిఎస్-IV ఉద్గార నియమ నిబంధనలలో మరింత క్లారిటీ కోసం తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసిన తమిళనాడు ఆర్‌టిఓ అధికారులు పేర్కొన్నారు. బిఎస్-III మరియు బిఎస్-IV టూ వీలర్లపై మరింత స్పష్టత కోరుకుంటున్నట్లు తెలిపారు.

టూ వీలర్ల రిజిస్ట్రేషన్‌ నిలిపేసిన తమిళనాడు ఆర్‌టిఓలు

నూతన రెగ్యులేషన్‌కు అనుగుణంగా బిస్-III మరియు బిఎస్-IV వాహనాలను వేరుగా రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియలకు సంభందించిన పత్రాలు ఇంకా అందుబాటులో లేకపోవడం వలనే వీటి రిజిస్ట్రేషన్లకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

టూ వీలర్ల రిజిస్ట్రేషన్‌ నిలిపేసిన తమిళనాడు ఆర్‌టిఓలు

ఏప్రిల్ 1, 2017 నుండి బిఎస్-III వాహనాల రిజిస్ట్రేషన్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని సుప్రీం కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ 1, 2017 తరువాత బిఎస్-IV వాహనాల రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగాల్సి ఉండగా ముందస్తు ప్రకటన లేకుండా అధికారులు బిఎస్-IV వాహనాల రిజిస్ట్రేషన్ అడ్డుకుంటున్నారు.

టూ వీలర్ల రిజిస్ట్రేషన్‌ నిలిపేసిన తమిళనాడు ఆర్‌టిఓలు

యమహా మోటార్ ఇండియా మాట్లాడుతూ, రవాణా శాఖ కమీషనర్‌ను కలిసి, కావాల్సిన డాక్యుమెంట్లు మరియు స్పష్టత ఇచ్చినట్లు తెలిపింది. అయితే డ్యాక్యుమెంట్ల సమర్పణ మరియు స్పష్టత ఇవ్వడంలో బజాజ్ మరియు హోండా ముందులో ఉన్నాయి.

టూ వీలర్ల రిజిస్ట్రేషన్‌ నిలిపేసిన తమిళనాడు ఆర్‌టిఓలు

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, కోయంబత్తూరు మరియు మదురైలలోని ఆర్‌టిఓలు బజాజ్ మరియు హోండాతో పాటు ఏ ఒక్క సంస్థకు చెందిన టూ వీలర్‌ రిజిస్ట్రేషన్‌ను పూర్తిగా నిలిపేశాయి. అదే విధంగా చెన్నైలో యమహా, టీవీఎస్ మరియు హీరో టూ వీలర్ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేశారు.

టూ వీలర్ల రిజిస్ట్రేషన్‌ నిలిపేసిన తమిళనాడు ఆర్‌టిఓలు

యమహా మోటార్ ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, ఆర్‌టిఓ అధికారులకు కావాల్సిన పత్రాలు మరియు బిఎస్-IV రెగ్యులేషన్‌కు సంభందించిన స్పష్టతను ఇచ్చామని, మరో రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగుతాయని కస్టమర్లకు ధీమా వ్యక్తం చేసింది.

Most Read Articles

English summary
Read In Telugu to know about Tamil Nadu RTOs Stop Registering Yamaha, Hero And TVS Two-Wheelers
Story first published: Friday, April 21, 2017, 12:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X