రహస్యంగా పట్టుబడిన అపాచే ఆర్ఆర్ 310ఎస్: ఫోటోలు మరియు సాంకేతిక వివరాలు

Written By:

టీవీఎస్ అనగానే మనకు గుర్తొచ్చే కొన్ని ఎంట్రీ లెవల్ మోడళ్లు సూపర్ ఎక్స్ఎల్, స్టార్ సిటి, స్పోర్ట్. మరి ఇంకాస్త శక్తివంతమైన మోడళ్లు అంటే అపాచే శ్రేణి టూ వీలర్లు. అయితే దేశీయ స్పోర్ట్స్ బైకుల సెగ్మెంట్లో పట్టులేని టీవీఎస్ ఇప్పుడు ప్రపంచ స్థాయి సాంకేతికత మరియు విలువలతో అపాచే ఆర్ఆర్ 310ఎస్ స్పోర్ట్స్ బైకును పూర్తి స్థాయిలో అభివృద్ది చేసింది.

త్వరలో ఇండియన్ స్పోర్ట్స్ బైకుల సెగ్మెంట్లోకి విడుదల కానున్న అపాచే ఆర్ఎర్ 310ఎస్ స్పోర్ట్స్ బైకును టీవీఎస్ రహస్యంగా పరీక్షించింది. గతంలో అకులా అనే కాన్సెప్ట్ పేరుతో వచ్చిన ఈ మోటార్ సైకిల్‌కు చెందిన అనేక కొత్త ఫోటోలు మరియు సాంకేతిక వివరాలు లీకయ్యాయి.

టీవీఎస్ మోటార్స్ తొలుత అకులా పేరుతో 2016 ఇండియన్ ఆటో ఎక్స్‌ పో వేదిక మీద ప్రదర్శించింది. ప్రొడక్షన్ దశకు చేరుకున్న మోడల్‌కు అపాచే ఆర్ఆర్ 310ఎస్ అనే పేరును ఖరారు చేయడం జరిగింది.

కాన్సెప్ట్ మోడల్‌తో పోల్చుకుంటే ఇందులో పెద్ద మార్పులేవీ చోటు చేసుకోలేదు. అయితే ముందు వైపున్న ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ విభిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంది. నిలువుటాకారంలో మరే ఇతర మోడళ్లకు సరిపోలని రీతిలో ఉంది.

రహస్యంగా పరీక్షిస్తూ మీడియాకు చిక్కిన టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్ లోని ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో పొడవాటి విండ్ స్క్రీన్, ట్విన్ ప్రొజెక్టర్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, విభిన్నమైన ఆకారంలో ఉన్న రియర్ టెయిల్ ల్యాంప్స్ ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగినవి.

యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరి ఫీచర్‌గా అపాచే ఆర్ఆర్ 310ఎస్‌లో స్టాండర్డ్‌గా అందివ్వనుంది టీవీఎస్. జూలై లేదా ఆగష్టు 2017 లో విపణిలోకి అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఈ పూర్తి స్థాయి టీవీఎస్ స్పోర్ట్స్ బైకులో 313సీసీ సామర్థ్యం గల లిక్విడ్‌తో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

శక్తివంతమైన ఈ ఇంజన్‌ను బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ టీవీఎస్‌ మోటార్స్ సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించింది. దీనికి 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

టీవీఎస్ మోటార్స్ ఈ ఆపాచే ఆర్ఆర్ 310ఎస్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్‌ను కంపెనీ యొక్క హొసూర్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేయునుంది. రూ. 1.75 లక్షల నుండి రూ. 2 లక్షల మధ్య ధరల శ్రేణితో విడుదలయ్యే అవకాశం ఉంది.

టీవీఎస్ మోటార్స్ ఈ ఆపాచే ఆర్ఆర్ 310ఎస్ ను పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదల చేస్తే కెటిఎమ్ ఆర్‌సి390, కవాసకి నింజా 300 మరియు యమహా ఆర్3 వంటి వాటి నోర్లు మూయించనుంది. బైకు విలువలకు తగ్గ ధరలతో విడుదల చేస్తే భారీ విజయం ఖాయం!

source;

Story first published: Tuesday, June 6, 2017, 11:11 [IST]
English summary
Read In Telugu To Know More About TVS Apache RR 310S Spotted — Instrument Console Revealed
Please Wait while comments are loading...

Latest Photos