బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్: ఎగుమతులకు పెద్ద చెయ్యి - ఇండియాకు మొండి చెయ్యి

Written By:

దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్, బిఎమ్‌డబ్ల్యూ టూ వీలర్ల తయారీ విభాగం మోటోర్రాడ్‌ భాగస్వామ్యంతో జి310ఆర్ మోటార్ సైకిల్‌ను అభివృద్ది చేసింది. పలుమార్లు ఇండియన్ రహదారుల మీద పరీక్షించి, యువతలో అంచనాలు పెంచేసింది. అయితే దీని విడుదల విషయానికి వస్తే, ఇండియాకు మొండి చెయ్యి చూపించి విదేశాలకు ఎగుమతులు ప్రారంభించింది.

టీవీఎస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ సంయుక్తంగా అభివృద్ది చేసిన బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ మోటార్ సైకిల్‌ను అధికారికంగా విదేశీ మార్కెట్‌కు ఎగుమతులు ప్రారంభించింది.

దేశీయంగా అభివృద్ది చేయడంతో తొలుత ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసి, ఆ తరువాత విదేశీ విపణికి ఎగుమతులను ప్రారంభిస్తుందనే అంచనాలు ఉండేవి, అయితే ఎగుమతులకు పెద్ద పీట వేస్తూ దేశీయ కస్టమర్లను ఊరించిందని చెప్పాలి.

టీవీఎస్ మోటార్స్ తమ హోసూర్ ప్లాంటులో దీనిని ఉత్పత్తి చేస్తోంది. జర్మనీకి చెందిన దిగ్గజ ఖరీదైన బైకుల తయారీ విభాగం బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసింది.

వివిధ కారణాల వలన జి310ఆర్ ఇండియా విడుదల అలస్యం కానుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ మోటార్ సైకిల్‌ 2017 మలిసగంలో విపణిలోకి విడుదలయ్యే అవకాశం ఉంది.

దీనికంటే ముందు బిఎమ్‍‌‌డబ్ల్యూ మోటోరాడ్ విభాగం ఏప్రిల్ 2017 నుండి ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. జి310ఆర్ మరియు జి310జిఎస్ మోటార్ సైకిళ్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ జి310ఆర్ విడుదల చేయడానికి ప్రధానంగా ఉన్న సమస్య మౌలిక వసతులు. దేశవ్యాప్తంగా విక్రయ కేంద్రాల ఏర్పాటు మీద దృష్టిసారిస్తున్నట్లు తెలిసింది. ఇందు కోసం మరి కొన్ని నెలల సమయం పట్టనున్నట్లు తెలిసింది.

జి310ఆర్ మరియు జి310జిఎస్ మోటార్ సైకిళ్ల అనంతరం ఎక్కువ సామర్థ్యం ఉన్న కె1600, ఆర్1200 మరియు ఎస్1000 బైకులను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది.

ప్రస్తుతం దేశీయంగా ఉన్న శక్తివంతమైన మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో ఉన్న ప్రీమియమ్ బైకుల తయారీ సంస్థలు డుకాటి, కవాసకి, ట్రయంప్ మరియు ఇతర సంస్థలకు బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ విభాగం బలమైన పోటీనివ్వనుంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ విషయానికి వస్తే, సాంకేతికంగా ఇందులో 313సీసీ సామర్థ్యం ఉన్న సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 33.6బిహెచ్‍‌‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ లోని శక్తివంతమైన ఇంజన్‌కు అనుసంధానం చేసిన 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ వెనుక చక్రానికి సరఫరా అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 143 కిలోమీటర్లుగా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఇందులో అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్‌ఫోర్క్స్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, పూర్తి స్థాయి డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, వంటి ప్రీమియమ్ ఫీచర్లను అందించింది.

ఒక్కసారి పూర్తి స్థాయిలో దేశీయ విపణిలోకి విడుదలయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న కెటిఎమ్ డ్యూక్ 390, మహీంద్రా మోజో మరియు బజాజ్ డామినర్ వంటి బైకులకు గట్టి పోటీనివ్వనుంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Also Read In Telugu: TVS Begins Exporting BMW G 310 R Overseas — India Launch Unclear
Please Wait while comments are loading...

Latest Photos