GST ప్రభావంతో ధరలు తగ్గించిన టీవీఎస్

చెన్నై ఆధారిత దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ తమ టూ వీలర్ల మీద ధరలు తగ్గించినట్లు ప్రకటించింది.

By Anil

చెన్నై ఆధారిత దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ తమ టూ వీలర్ల మీద ధరలు తగ్గించినట్లు ప్రకటించింది. జిఎస్‌టి ప్రతిఫలాలను కస్టమర్లకు అందించేందుకు, నూతన ట్యాక్స్ విధానం ఆధారంగా తమ టూ వీలర్ల ధరలను సవరించినట్లు టీవీఎస్ తెలిపింది.

 ధరలు తగ్గించిన టీవీఎస్

టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ మరియు సిఇఒ కెఎన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, " నూతన జిఎస్‌టి వ్యాపార సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. దీనికి అనుగుణంగానే జిఎస్‌టిలో ఉన్న ట్యాక్స్ మేరకు తమ టూ వీలర్ల ధరల్లో మార్పులు చేసినట్లు తెలిపాడు."

 ధరలు తగ్గించిన టీవీఎస్

జూలై 1, 2017 నుండి దేశవ్యాప్తంగా జిఎస్‌టి అమల్లోకి రానుంది. చాలా వరకు రాష్ట్రాల్లో జిఎస్‌టికి అనుగుణంగా టూ వీలర్ల ధరలు తగ్గముఖం పట్టనున్నాయి. అయితే వివిధ రాష్ట్రాల మధ్య ధరల తగ్గింపులో వ్యత్యాసం ఉంటుంది.

 ధరలు తగ్గించిన టీవీఎస్

ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ విధానం ప్రకారం, మోటార్ సైకిళ్ల మీద ట్యాక్స్ 30 శాతముగా ఉంది. జిఎస్‌టి అమలైతే ఇది 28 శాతముగా ఉండనుంది. కాబట్టి రెండు శాతం మేర ట్యాక్స్ తగ్గడంతో ధరలు స్వల్ప మేరకు తగ్గనున్నాయి.

 ధరలు తగ్గించిన టీవీఎస్

అయితే 350సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్ల మీద 28 శాతం ట్యాక్స్‌తో పాటు మూడు శాతం సెస్ అదనంగా రానుంది. ప్రస్తుతం ఎంత మేరకు ధరలు తగ్గాయో అనే విషయాన్ని వెల్లడించడానికి టీవీఎస్ నిరాకరించింది.

 ధరలు తగ్గించిన టీవీఎస్

దేశీయంగా ఉన్న బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ మరియు యుఎమ్ లోహియా టూ వీలర్స్‌తో పాటు హోండా టూ వీలర్స్ కూడా జిఎస్‌టికి లోబడి తమ ఉత్పత్తుల ధరలు సవరించినట్లు పేర్కొన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ టూ వీలర్ కంపెనీ జిఎస్‌టికి అనుగుణంగా ధరలు తగ్గించడంతో రూరల్ ఏరియాల్లో టీవీఎస్ టూ వీలర్లను ఎంచుకునే వారికి మరింత లాభం చేకూరనుంది.

Most Read Articles

Read more on: #టీవీఎస్
English summary
Read In Telugu TVS Motors Cuts Prices Of Its Two-Wheelers
Story first published: Tuesday, June 27, 2017, 11:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X