భారత దేశపు రెండవ అతి పెద్ద స్కూటర్ల తయారీ సంస్థగా టీవీఎస్

Written By:

భారత దేశపు రెండవ అతి పెద్ద స్కూటర్ల తయారీ సంస్థల జాబితాలో హీరో మోటోకార్ప్ స్థానం రెండు. అయితే ఈ ధోరణి మారిపోయింది. అనూహ్యంగా టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. స్కూటర్ల అమ్మకాలకు సంభందించిన గణాంకాలను పరిశీలిస్తే మీరు కూడా అవునంటారు. మరెందుకు ఆలస్యం నేటి కథనంలో టీవీఎస్ విజయం... హీరో మోటోకార్పో పతనానికి కారణం ఏమిటో చూద్దాం రండి.....

స్కూటర్ల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, హీరో మోటోకార్ప్ 1,21,144 యూనిట్ల అమ్మకాలు జరిపి 49 శాతం వృద్దిని కోల్పోయింది. అయితే ఇదే తరుణంలో టీవీఎస్ మోటార్ కంపెనీ1,88,609 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. అంతుకు మునుపటి గణాంకాల ప్రకారం టీవీఎస్ కేవలం 3 శాతం వృద్దిని కోల్పోయి రెండవ స్థానంలో నిలిచింది.

ఈ ఆర్థిక సంవత్సరం యొక్క పదవ నెల వరకు టీవీఎస్ మొత్తం 6,77,172 యూనిట్లను విక్రయించగా, హీరో మోటోకార్ప్ 6,58,255 యూనిట్లను విక్రయించింది. టీవీఎస్‌తో పోల్చుకుటే 742 యూనిట్లు తక్కువే అమ్ముడయ్యాయి.

టీవీఎస్ మోటార్ స్కూటర్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అనిరుధ్ హల్దార్ మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు సందర్భంలో పట్టణ మరియు ప్రాంతీయ విపణిలో స్టాక్‌కు మరియు నోట్ల రద్దు ప్రభావం ఉన్న రోజులకు అనుగుణంగా టీవీఎస్ మోటార్స్ తీసుకున్న నిర్ణయాలు అమ్మకాల్లో వృద్ది సాద్యమైందని తెలిపాడు.

ఆరోగ్యకరమైన 30 రోజుల స్టాక్‌ను మెయింటెన్ చేసినట్లు తెలిపాడు. అర్బన్ మరియు రూరల్ ప్రాంతాల్లో చక్కగా బ్యాలెన్స్ చేయడంలో టీవీఎస్ సక్సెస్ అయ్యింది. అయితే నవంబర్, డిసెంబర్ చివర్లో డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి చేశారు.

హీరో మోటోకార్ప్ సరిగ్గా చివరి ఐదవ త్రైమాసికం వరకు 14 శాతం వృద్దిని సాధించింది. అయితే నోట్ల రద్దు సమయం నుండి హీరోమోటోకార్ప్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.

టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగ 2017 టీవీఎస్ వీగో ను బిఎస్-IV ఇంజన్ మరియు నూతన కలర్ ఆప్షన్‌లతో విపణిలోకి విడుదల చేసింది.

ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న నూతన స్కూటర్లు గురించి...
దేశీయ వాహన పరిశ్రమ బైకులు మరియు కార్ల విడుదలతో పాటు స్కూటర్ల విడుదలకు కూడా సిద్దమైంది. ఫేస్‌లిప్ట్ మరియు లిమిటెడ్ ఎడిషన్‌గా కాకుండా ఐదు కొత్త ఉత్పత్తులు విడుదలకు సన్నద్దం అవుతున్నాయి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Tvs Motor Becomes Second Largest Scooter Manufacturer India
Please Wait while comments are loading...

Latest Photos