హీరోని వెనక్కినెట్టిన టీవీఎస్

భారత దేశపు అత్యుత్తమ స్కూటర్ల విక్రయ సంస్థ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్‌ను మూడవ స్థానంలోకి నెట్టి, టీవీఎస్ మోటార్స్ ఈ స్థానాన్ని సొంతం చేసుకుంది.

Written By:

చెన్నై ఆధారిత ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ మరో మైలురాయిని సాధించింది. స్కూటర్ సెగ్మెంట్లో హీరో మోటోకార్ప్‌ను వెనక్కి నెట్టేసి భారత దేశపు అత్యుత్తమ స్కూటర్ల విక్రయదారుగా టీవీఎస్ రెండవ స్థానంలో నిలిచింది.

ఈ ఆర్థిక సంవత్సరం 2016-2017 లోని ఏప్రిల్ - ఫిబ్రవరి మధ్య జరిగిన స్కూటర్ల విక్రయాల ప్రకారం హీరో మోటోకార్ప్ మూడవ స్థానానికి పరిమితం కాగా టీవీఎస్ రెండవ స్థానాన్ని ఆక్రమించింది.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2016 నుండి ఫిబ్రవరి 2017 మధ్య కాలంలో టీవీఎస్ సుమారుగా 7,43,838 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. గతంతో పోల్చితే 5.07 శాతం వృద్ది నమోదైంది.

హీరో మోటోకార్ప్‌లోని స్కూటర్ల విక్రయాల విషయానికి వస్తే, మునుపటి అమ్మకాలు 7,31,967 యూనిట్లతో పోల్చుకుంటే 1.64 శాతం వృద్దిని కోల్పోయి 7,19,987 యూనిట్ల విక్రయాలు జరిపింది. ఒకే కాల వ్యవధిలో నమోదైన విక్రయాలతో హీరో మరియు టీవీఎస్ లను పోల్చితే టీవీఎస్ ఆధిక్యంలో ఉంది.

ఏదైమయినప్పటికీ ఇరు తయారీదారులు మోటార్ సైకిల్ మరియు స్కూటర్ల విక్రయాల్లో ఒకే విధమైన ఫలితాలను సాధిస్తున్నాయి. అయితే ఈ రెండింటికి ప్రత్యక్షపోటీ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ 15.32 శాతం విక్రయాల వృద్దితో భారీ ఆధిక్యంలో ఉంది.

హోండా విక్రయాల విషయానికి వస్తే, గత ఏప్రిల్ 2016 నుండి ఫిబ్రవరి 2017 మధ్య కాలంలో 29,34,794 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. అంతకుమునుపటి ఆర్థిక సంవత్సరంలోని ఇదే కాలంతో పోల్చితే 3,89,922 యూనిట్ల ఎక్కువ విక్రయాలయ్యాయి.

స్కూటర్ల మార్కెట్ నానాటికీ జోరందుకుంటూనే ఉంది, ఈ సమయంలో యమహా ఇండియా స్కూటర్ల విక్రయాల్లో నాలుగవ స్థానంలో నిలిచింది. పైన తెలిపిన కాలంలో 3,95,704 యూనిట్ల స్కటూర్లను యమహా ఇండియా విక్రయించింది.

అదే విధంగా ఏప్రిల్ 2016 - ఫిబ్రవరి 2017 మధ్య కాలంలో సుజుకి సంస్థ 2,51,504 యూనిట్ల స్కూటర్లను విక్రయించి ఐదవ స్థానంలో నిలిచింది.

దేశవ్యాప్తంగా ఏప్రిల్ - ఫిబ్రవరి మధ్య కాలంలో స్కూటర్ విక్రయాలు 11.7 శాతం వరకు పెరిగాయి(5,36,357 యూనిట్లు). ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య కాలంలో 45,81,640 యూనిట్ల నుండి 51,17,997 యూనిట్లకు విక్రయాలు ఎగబాకాయి.

 

WHAT OTHERS ARE READING

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Also Read In Telugu: TVS Sails Ahead Of Hero In Scooter Sales; Now India's Second Largest Scooter Seller
Please Wait while comments are loading...

Latest Photos