బిఎస్-III ఇంజన్ టూ వీలర్ల స్టాక్ క్లియర్ చేసేందుకు ఎలాంటి ఆఫర్లను ప్రకటించాయో తెలుసా ?

Written By:

సుప్రీం కోర్టు తీర్పు మేరకు బిఎస్-III ఇంజన్ గల ద్విచక్ర వాహనాల విక్రయాలకు చివరి తేదీ నేడే. రేపటి నుండి బిఎస్-III స్థానంలో బిఎస్-IV ఇంజన్ గల టూ వీలర్ల విక్రయాలు మాత్రమే జరగనున్నాయి. అయితే నేడే చివరి రోజు కావడంతో టూ వీలర్ల తయారీ సంస్థలు తమ బిఎస్-III స్టాకును క్లియర్ చేసేందుకు భారీ ఆఫర్లు ప్రకటించాయి.

హీరో మోటోకార్ప్, హోండా టూ వీలర్స్, బజాజ్ ఆటో మరియు టీవీఎస్ వంటి దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థలు భారీ స్థాయిలో ఆఫర్లను ప్రకటించాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క రోజులో వీలైనన్ని టూ వీలర్ల విక్రయాలను టార్గెట్ చేసుకున్నాయి.

గణాంకాల ప్రకారం మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న టూ వీలర్ల తయారీ సంస్థల వద్ద విక్రయించబడని బిఎస్-III బైకుల సంఖ్య 6,70,000 యూనిట్లుగా ఉన్నాయి. స్టాక్ క్లియర్ చేసుకునేందుకు గరిష్టంగా 22,000 రుపాయల వరకు తగ్గింపు ప్రకటించాయి.

జపాన్‌కు చెందిన టూ వీలర్ల తయారీ దిగ్గజం హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా విభాగం కేవలం మార్చి 31 కోసం మాత్రమే భారీ తగ్గింపును ప్రకటించినట్లు తమ అధికారిక వెబ్‌సైట్ మరియు ఫేస్‌బుక్ ద్వారా పేర్కొంది.

మార్చి 31 న జరిగే అన్ని బిఎస్-III ఇంజన్‌లు ఉన్న బైకులు మరియు ఆటోమేటిక్ స్కూటర్ల మీద గరిష్టంగా రూ. 22,000 ల వరకు తగ్గింపు ప్రకటించింది. ఈ వార్తతో దేశవ్యాప్తంగా ఉన్న హోండా విక్రయ కేంద్రాల్లో కస్టమర్లతో కిటకిటలడాయి.

భారత దేశపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ బిఎస్-III ఉత్పత్తుల మీద గరిష్టంగా రూ. 12,500 ల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. దీనికి అదనంగా ఉచిత ఇన్సూరెన్స్ ఆఫర్ కూడా అందివ్వడం జరిగింది.

బజాజ్ ఆటో తమ లైనప్‌లోని అన్ని బైకుల మీద ఉచిత ఇన్సూరెన్స్ ప్రకటించింది. అంతే కాకుండా, సిటి100 మీద రూ. 3000 లు, అవెంజర్, పల్సర్ మరియు ఆర్ఎస్200 మీద వరుసగా రూ. 2,000లు, రూ.7,000 లు మరియు 12,000 రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది.

ఇక అమ్ముడుపోకుండా మిగిలిపోయిన బిఎస్-III టూ వీలర్ల గురించి డీలర్లు ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదని కొన్ని తయారీ సంస్థలు తమ డీలర్లకు భరోసానిచ్చాయి.

నేడు (మార్చి 31, 2017) దేశవ్యాప్తంగా జరిగిన విక్రయాల్లో సాధారణ కమ్యూటర్ బైకు ధరలు రూ. 40,000 నుండి రూ. 50,000 ల మధ్య అందుబాటులో ఉన్నాయి. మరి ఈ స్థాయిలో ధరలను తగ్గించి తమ బైకులను విక్రయించుకోవడానికి కారణం ఏమిటని ఆలోచిస్తున్నారా...? దీనికి సమాధానం చూద్దాం రండి..

సాధారణంగా టూ వీలర్లలో అందించే ఇంజన్‌లు భారత్ స్టేజ్-III ఉద్గార నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే సుప్రీం కోర్టు గతంలో పేర్కొన్న కథనం మేరకు ఏప్రిల్ 1, 2017 నుండి అన్ని టూ వీలర్లు కూడా బిఎస్-IV ఇంజన్‌లతో అప్‌గ్రేడ్స్ నిర్వహించి విక్రయించాల్సి ఉంది. గడువు ముగియడంతో గతంలో అధిక మొత్తంలో ఉత్పత్తి చేసిన టూ వీలర్ల స్టాక్ అధికంగా ఉండటంతో వాటిని క్లియర్ చేసుకునేందుకు కనీవిని ఎరుగని రీతిలో డిస్కౌంట్లను ప్రకటించి మరీ విక్రయాలు చేపట్టాయి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Friday, March 31, 2017, 19:02 [IST]
English summary
Manufacturers Offering Massive Discounts On BS-III Models — Offers Ends Today
Please Wait while comments are loading...

Latest Photos