పెరిగిన యుఎమ్ మోటార్ సైకిల్స్ ధరలు

యుఎమ్ మోటార్స్ సైకిల్స్ 2016 తో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రారంభంలో రెండు ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ రెండింటి మీద 5 శాతం వరకు ధరలు పెంపు ప్రకటించింది.

Written By:

అమెరికాకు చెందిన ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ గత ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదికగా మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రారంభంలో రెనిగేడ్ కమాండో మరియు రెనిగోడ్ స్పోర్ట్స్ ఎస్ మోడళ్లను విడుదల చేసింది. ఈ రెండింటి మీద ఐదు శాతం మేరకు ధరలను పెంచినట్లు నేడు (జనవరి10, 2017) ప్రకటించింది.

ధరల పెంపు అనంతరం సవరణ చేయబడిన ధరలు

  • రెనిగేడ్ కమాండో ధర రూ. 1.64 లక్షలు
  • రెనిగేడ్ స్పోర్ట్స్ ఎస్ ధర రూ. 1.57 లక్షలు
రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నట్లు యుఎమ్ మోటార్ సైకిల్స్ పేర్కొంది.

ఏడాది క్రితం ఇదే రెనిగేడ్ కమాండో రూ. 1.59 లక్షలు మరియు రెనిగేడ్ స్పోర్ట్స్ ఎస్ రూ. 1.49 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్‌ ధరతో విడుదలైంది. కమాండో మీద రూ. 5,000 లు మరియు స్పోర్ట్స్ ఎస్ వేరియంట్ మీద రూ. 8,000 ల వరకు పెరిగింది.

ధరల పెంపు సంధర్బంగా యుఎమ్ఎల్ డైరెక్టర్ రాజీవ్ మిశ్రా గారు మాట్లాడుతూ, తయారీ మరియు పెట్టుబడుల మీద భారం పెరిగిన నేపథ్యంలో ధరల పెంపు తప్పనిసరి అయ్యిందని వివరణ ఇచ్చారు.

సాంకేతికంగా రెనిగేడ్ కమాండో క్రూయిజర్ బైకులో 280సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 25బిహెచ్‌పి పవర్ మరియు 21.8ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

రెనిగేడ్ కమాండో బైకులో ముందు వైపున డిస్క్ మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేక్ కలదు. సస్పెన్షన్ పరంగా ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున స్ప్రింగ్ సస్పెన్షన్ కలదు. ఇందులో సులభమైన రైడింగ్ కోసం పొడవాటి హ్యాండిల్ బార్ కలదు.

రెనిగేడ్ కమాండోతో పాటు విడుదలైన స్పోర్ట్స్ ఎస్ వేరియంట్లో అదే ఇంజన్ కలదు. అయితే డిజైన్ పరంగా ఇది విభిన్నంగా ఉంటుంది. రెండు మోటార్ సైకిళ్లలో ఎలక్ట్రిక్ స్టార్ట్ కలదు. స్పోర్ట్స్ ఎస్ వేరియంట్లో స్టాండర్డ్‌గా ఎల్ఇడి లైట్లున్నాయి. సులభమైన రైడింగ్ కోసం ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ సింక్రోమెష్డ్ గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

యుఎమ్ మోటార్ సైకిల్స్ 2017 ఏడాదిలో మరిన్ని ఉత్పత్తులు చేసే అవకాశం ఉంది, తెలుగులో తాజా ఆటోమొబైల్ వార్తల కోసం చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్.....

లీకైన టాటా హెక్సా ధరలు; ఎంతో తెలుసా...?
టాటా మోటార్స్ వచ్చే జనవరి 18, 2017 నాటికి ఇండియన్ మార్కెట్లోకి తమ హెక్సా ను విడుదల చేయనుంది. అయితే టాటా అధికారిక వెబ్‌సైట్ నుండి ఈ హెక్సా ధరలు లీక్ అయ్యాయి.

ఇక మీదట హైదరాబాద్ లో కార్లు కొనడం కష్టమే: ఎందుకంటే...?
హైదరాబాద్‌లో కొత్తగా కొనుగోలు చేసిన కార్ల రిజిస్ట్రేషన్ కు పార్కింగ్ స్పేస్ తప్పనిసరి అని చట్టాన్ని తీసుకొచ్చే నిర్ణయంలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు తెలిసింది.

2017 డకార్ ర్యాలీ ఫోటో గ్యాలరీ...
 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Tuesday, January 10, 2017, 19:04 [IST]
English summary
UM Motorcycles Hikes Prices Of Its Motorcycles — Here Are The Revised Prices
Please Wait while comments are loading...

Latest Photos