2017 లో ఇండియాలో విడుదల కానున్న ఐదు కొత్త స్కూటర్లు

దేశీయ వాహన పరిశ్రమ బైకులు మరియు కార్ల విడుదలతో పాటు స్కూటర్ల విడుదలకు కూడా సిద్దమైంది. ఫేస్‌లిప్ట్ మరియు లిమిటెడ్ ఎడిషన్‌గా కాకుండా ఐదు కొత్త ఉత్పత్తులు విడుదలకు సన్నద్దం అవుతున్నాయి.

By Anil

దేశీయంగా బైకులకు ఎంతటి ప్రాదాన్యత ఉందో... అదే స్థాయిలో స్కూటర్లు కూడా ప్రాదాన్యతను సంతరించుకుంటున్నాయి. బైకులను తలదన్నే రీతిలో స్కూటర్లు అమ్మకాలను జరుపుతున్నాయి. అందుకే కాబోలు ఇప్పుడు దిగ్గజ టూ వీలర్ల సంస్థలు స్కూటర్ల సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి.

ఈ ఏడాదికి ఐదు కొత్త స్కూటర్లు

దేశీయ ప్రధాన ద్విచక్ర వాహన తయారీ సంస్థలయిన హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్, పియాజియో మరియు మరో స్టార్టప్ కంపెనీ కూడా తమ ఉత్పత్తులను ఈ ఏడాదిలో విడుదల చేయడానికి సిద్దమయ్యాయి.

హీరో డ్యూయెట్ ఇ

హీరో డ్యూయెట్ ఇ

హీరో డ్యూయెట్ ఇ మొదటి సారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించబడింది. మరియు హీరో యొక్క మొదటి పూర్తి స్థాయి స్థాయి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. పూర్తి స్థాయిలో దేశీయంగా అభివృద్ది చేయబడుతున్న ఇది డిజైన్ మరియు సాంకేతికంగా హీరో యొక్క అప్ కమింగ్ లీప్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పంచుకోనుంది. ఎక్ట్సీరియర్ డిజైన్ పరంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న హీరో డ్యూయెట్ స్టాండర్డ్ డిజైన్ శైలిలో రానుంది.

ఈ ఏడాదికి ఐదు కొత్త స్కూటర్లు

డ్యూయెట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 6బిహెచ్‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ మోటార్‌ను అందివ్వనుంది. ఇది కేవలం 6.5 సెకండ్ల కాల వ్యవధిలోనే గంటకు 0 నుండి 60కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలయితే దీని ధర సుమారుగా రూ. 50,000 నుండి 55,000 ల మధ్య ఉండే అవకాశం ఉంది.

హీరో జడ్ఐఆర్ 150

హీరో జడ్ఐఆర్ 150

2017 లో హీరో మోటోకార్ప్ విడుదల చేయనున్న మరో స్కూటర్ జడ్ఐఆర్150. జడ్ఐఆర్150 సాంకేతికంగా 157.1సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంది. లీటర్‌కు సుమారుగా 110కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగిలగే ఈ బైకు గరిష్టంగా 14బిహెచ్‌పి పవర్ మరియు 12.7ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

ఈ ఏడాదికి ఐదు కొత్త స్కూటర్లు

హీరో జడ్ఆర్150 స్కూటర్ ఫీచర్లకు పెట్టింది పేరు. ఇందులో 9 లీటర్ల స్టోరేజీ సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు, డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, విండ్ షీల్డ్, ఎల్ఇడి టర్న్ ఇండికేటర్స్, ముందు వైపు హైడ్రాలిక్ డిస్క్ బ్రేకు కలదు, ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం ఉన్న డ్యూయల్ షాక్ అబ్జార్వర్, ఎలక్ట్రిక్ స్టార్ట్, స్ల్పిట్ సీటు కలదు.

ఈ ఏడాదికి ఐదు కొత్త స్కూటర్లు

ఎరుపు, నీలం మరియు నలుపు రంగుల్లో లభించే దీని ధర సుమారుగా రూ. 85,000 లు ఎక్స్ షోరూమ్‌గా ఉండనుంది.

వెస్పా జిటిఎస్ 300

వెస్పా జిటిఎస్ 300

పియాజియో వారి వెస్ప జిటిఎస్300 తమ మొత్తం లైనప్‌లో అత్యంత ఖరీదైన స్కూటర్ అని చెప్పొచ్చు. తమ లైనప్‌లో ఏంటి దేశవ్యాప్తంగా ఇదే అత్యంత ఖరీదైన స్కూటర్‌గా నిలవనుంది. సుమారుగా రూ. 4 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో విడుదల కానున్న ఇది రెట్రో స్టైల్లో, భారీ ఫీచర్లతో రానుంది. సాధారణ వెస్పా రూపాన్ని పోలి ఉన్నప్పటికీ ఇందులో అనలాగ్-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, ఎల్‌సిడి డిస్ల్పే కలదు. ఇందులో ఫ్యూయల్ గేజ్, ట్రిప్ మీటర్, ఓడో మీటర్ మరియు గడియారం వంటి ఫీచర్లున్నాయి.

ఈ ఏడాదికి ఐదు కొత్త స్కూటర్లు

ఈ మాత్రం ఫీచర్లకే లక్షలు వెచ్చించాలా... అని చాలా మందికి అనిపిస్తుంది, అందుకే పియాజియో ఇందులో మరే స్కూటర్‌లో సాధ్యం కాని విధంగా 278సీసీ సామర్థ్యం గల లిక్విడ్‌తో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ అందించింది. ఇది గరిష్టంగా 21బిహెచ్‌పి పవర్ మరియు 22ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. భద్రత పరంగా ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానెల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, రెండు చక్రాలకు 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

అథర్ ఎస్340

అథర్ ఎస్340

అథర్ ఎనర్జీ, బెంగళూరు ఆధారిత స్వదేశీ సంస్థ. అథర్ సంస్థ పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు బైకుల తయారీ మీద దృష్టిపెట్టింది. అథర్ సంస్థ తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఎస్340 ని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. అథర్ తెలిపిన వివరాల మేరకు హోండా ఆక్టివా మరియు పియాజియా వెస్పాల మధ్య ధరతో విడుదల కానున్న ఇది ఇప్పుడు ప్రొడక్షన్ దశకు చేరుకున్నట్లు తెలిసింది.

ఈ ఏడాదికి ఐదు కొత్త స్కూటర్లు

2017 లో విడుదల కానున్న ఇందులో 3 లేదా 5 కిలోవాట్ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ అందివ్వనున్నారు. ఇది గరిష్టంగా 14ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. కేవలం 90కిలోలు బరువుతోనే నిర్మిస్తున్న ఈ స్కూటర్ గరిష్ట వేగం 72 కిలోమీటర్లుగా ఉంటూ, ఒక్క సారి ఛార్జింగ్‌తో 100కిలోమీటర్లు ప్రయాణించగలదని అథర్ ప్రతినిధులు నమ్మకం వ్యక్తం చేశారు.

టీవీఎస్ ఎన్‌టార్క్ 210 కాన్సెప్ట్

టీవీఎస్ ఎన్‌టార్క్ 210 కాన్సెప్ట్

స్వదేశీ పరిజ్ఞానంతో టూ వీలర్ల తయారీలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న టీవీఎస్ మోటార్ కంపెనీ 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఎన్‌టార్క్ 210 మరియు ఎన్‌టార్క్ 125 అనే రెండు కాన్సెప్ట్ స్కూటర్లను ప్రదర్శించింది. ఎన్‌టార్క్210 గురించి చూస్తే, ఇది 212.5సీసీ సామర్థ్యం గల లిక్విండ్‌తో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్‌తో రానుంది.

ఈ ఏడాదికి ఐదు కొత్త స్కూటర్లు

ట్యూబ్ లెస్ టైర్లు, ఇరు వైపులా డిస్క్ బ్రేకులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ లతో పాటు ఎల్ఇడి హెడ్ ల్యాంప్, స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్, జిపిఎస్ న్యావిగేషన్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న ఇది సుమారుగా రూ. 1 లక్ష ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

టీవీఎస్ ఎన్‌టార్క్125

టీవీఎస్ ఎన్‌టార్క్125

టీవీఎస్ ఈ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ను ఎన్‌టార్క్210 ఆధారంతో రూపొందించింది. ఇందులో 125సీసీ సామర్థ్యం గల అల్యూమినియం ఇంజన్ కలిగి ఉంది. ఎన్‌టార్క్210 మరియు 125 రెండు కూడా 8 లీటర్ల స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దీనిని సుమారుగా రూ. 52,000 నుండి 58,000 ల మధ్య ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ ఏడాదికి ఐదు కొత్త స్కూటర్లు

ఈ బైక్ మైలేజ్ 93 కిమీ/లీ....

హీరో నుండి రూ. 19,990 లకే ఎలక్ట్రిక్ స్కూటర్

ఒక్క సారి చార్జింగ్ తో 643 కిమీలు నడిచే బైకు: పూర్తి వివరాలు

అప్రిలియా ఎస్ఆర్ 150 రేస్ ఎడిషన్ ఫోటోలు కోసం ఇక్కడున్న గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

Most Read Articles

English summary
Upcoming Scooters In India In 2017
Story first published: Monday, February 13, 2017, 12:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X