ఒక్క సారి చార్జింగ్‌తో 643 కిమీలు నడిచే బైకు: పూర్తి వివరాలు

Written By:

మోటార్ సైకిళ్ల తయారీలో బాగా చెయ్యితిరిగి సంస్థ కాదు, ఎన్నో ఏళ్ల క్రితం స్థాపించిన సంస్థ అంతకన్నా కాదు. స్టార్టప్‌గా మొదలై ఇపుడు ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో విప్లవాన్ని సృష్టిస్తోంది. పెట్రోల్ ఇంజన్ గల బైకులకు కూడా సాధ్యం కాని రీతిలో పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తోంది. అంతేనా మైలేజ్, స్పీడ్, డిజైన్ ఒక్కటేమి ఇలాంటి అనేక అంశాల పరంగా ఎలక్ట్రిక్ బైక్ ప్రేమికులను మంత్రముగ్దుల్ని చేస్తోంది.

ఇంగ్లాండుకు చెందిన స్టార్టప్ విగో మోటార్ సైకిల్స్ ఈ ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే బైకును నిర్మించింది. ఇది గరిష్టంగా గంటకు 290కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. అయితే దీని మొత్తం బరువు కేవలం 160 కిలోలుగా ఉంది.

120బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల ఇది కేవలం 3.2 సెకండ్ల కాల వ్యవధిలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఒక్క సారి ఛార్జింగ్ చార్జింగ్ ద్వారా ఈ సూపర్ బైకు నిరంతరాయంగా 643 కిలోమీటర్లు లేగా 400 మైళ్ల పాటు ప్రయాణిస్తుందని విగో మోటార్ సైకిల్స్ బృందం తెలిపింది.

ఈ మోటార్ సైకిల్‌లో 21కిలోవాట్‌హవర్ బ్యాటరీని అనుసంధానం చేశారు. ఎలక్ట్రిక్ మోటార్‍‌‌కు పవర్ ఈ బ్యాటరీ ద్వారా అందుంతి. దీనిని కేవలం 20 నుండి 30 నిమిషాలలోపే పూర్తి స్థాయిలో ఛార్జ్‌ చేస్తుంది.

ఇంగ్లాండ్ మార్కెట్లో దీని ధర 7,999 యూరోలుగా ఉన్నట్లు విగో మోటార్ సైకిల్స్ తెలిపింది. మన ఇండియన్ కరెన్సీలో దీనిని విలువ సుమారుగా రూ. 6.71 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది.

విగో మోటార్ సైకిల్స్ విడుదల చేసిన టీజర్ వీడియోను వీక్షించండి

 

Story first published: Tuesday, February 7, 2017, 18:41 [IST]
English summary
Video: Vigo Electric Motorcycle; 120bhp, 290km/h, 0-100 In 3.2 Sec
Please Wait while comments are loading...

Latest Photos