ఫేజర్ 250 మోటార్ సైకిల్ పరీక్షిస్తున్న యమహా

Written By:

జపాన్ దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ యమహా ఇండియా విభాగానికి దేశీయ విపణిలో మంచి విక్రయాలు సాధించిపెడుతున్న మోడళ్లలో ఫేజర్ ఒకటి. 150సీసీ సామర్థ్యం లభించే ఫేజర్ బ్రాండ్‌ లైనప్‌లోకి ఇప్పుడు 250సీసీ ఇంజన్ ఆప్షన్‌తో ఫేజర్ 250ను విడుదలకు సిద్దం చేస్తోంది.

రహదారి పరీక్షలు నిర్వహిస్తున్నపుడు మీడియాకు చిక్కిన మోడల్ మీద ఎలాంటి గ్రాఫిక్స్ లేవు మరియు ఇది యమహాకు చెందిన ఉత్పత్తి అని తెలిపే లోగోలు కూడా లేవు. అయితే సైలెంట్‌గా పరీక్షించి ఒక్కసారిగా విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

డిజైన్ పరంగా ఫేజర్ 250ను తీక్షణం గమనిస్తే, డబుల్ హెడ్ ల్యాంప్ క్లస్టర్‌కు బదులుగా సింగల్ హెడ్ ల్యాంప్ అందివ్వడం జరిగింది. బైక్‌కు ఇరువైపులా ఉన్న డీకాల్స్ గురించి ప్రక్కన పెడితే మిగతా డిజైన్ లక్షణాలను ఎఫ్‌జడ్25 నుండి సేకరించే అవకాశం ఉంది.

గతంలో యమహా విడుదల చేసిన ఎఫ్‌జడ్ 250 డిజైన్ తరహాలో ఉన్న ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు హ్యాండిల్ బార్ ఫేజర్ 250లో రానున్నాయి. వెనుక వైపు డిజైన్‍‌‌లో ప్రధానంగా ఎగ్జాస్ట్ సిస్టమ్ ఎఫ్‌జడ్25 యూనిట్‌ను పోలి ఉండనుంది.

ఫేజర్ 250 మోటార్ సైకిల్‌లో సాంకేతికంగా 249సీసీ సామర్థ్యం గల ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సింగల్ సిలిండర్ ఇంజన్‌తో రానుంది. 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఈ ఇంజన్ గరిష్టంగా 20.9బిహెచ్‌పి పవర్ మరియు 20ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

మునుపటి ఫేజర్‌తో పోల్చుకుంటే ముందు వైపున విశాలమైన డీకాల్స్‌కు స్వస్తి పలికి, గాలి ద్వారా కలిగే ఘర్షణను ఎదుర్కునే రీతిలో నూతన బాడీ డీకాల్స్‌తో రానుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఎఫ్‌జడ్ 25తో పోల్చుకుంటే మరింత బరువుతో రానుంది.

యమహా ఫేజర్ 250లో కనీసం ఆప్షనల్‌గా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించే అవకాశం ఉంది. ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి విడుదలయ్యే అవకాశం ఉన్న ఇది ప్రస్తుతం విపణిలో ఉన్న బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200, హోండా సిబిఆర్ 250ఆర్ మరియు కెటిఎమ్ ఆర్‌సి 200 లకు గట్టి పోటీనివ్వనుంది.

Read more on: #యమహా #yamaha
English summary
Read In Telugu Spy Pics: Yamaha Fazer 250 Spotted — Launch Imminent
Please Wait while comments are loading...

Latest Photos