ఎక్స్-బ్లేడ్ మీద బుకింగ్స్ ప్రారంభించిన హోండా

హోండా ఎక్స్-బ్లేడ్ స్పోర్టివ్ కమ్యూటర్ మోటార్ సైకిల్ మీద దేశవ్యాప్తంగా ఉన్న హోండా షోరూమ్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఐదు విభిన్న రంగుల్లో లభించనున్న హోండా ఎక్స్-బ్లేడ్ రూ. 79,000 ల కంటే తక్కువ ధరతో

By Anil

హోండా ఎక్స్-బ్లేడ్ స్పోర్టివ్ కమ్యూటర్ మోటార్ సైకిల్ మీద దేశవ్యాప్తంగా ఉన్న హోండా షోరూమ్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఐదు విభిన్న రంగుల్లో లభించనున్న హోండా ఎక్స్-బ్లేడ్ రూ. 79,000 ల కంటే తక్కువ ధరతో లభించనుంది.

హోండా ఎక్స్-బ్లేడ్ బుకింగ్స్

హోండా ఎక్స్‌-బ్లేడ్ తొలుత ఆటో ఎక్స్‌పో 2018లో రివీల్ అయ్యింది. ప్రత్యేకించిన ఇండియన్ మార్కెట్ కోసం ఈ స్పోర్టివ్ కమ్యూటర్ మోటార్ సైకిల్‌ను తీసుకొచ్చినట్లు హోండా ప్రతినిధులు పేర్కొన్నారు.

Recommended Video

Honda XBlade First Look Walkaround, Specs, Details, Features - DriveSpark
హోండా ఎక్స్-బ్లేడ్ బుకింగ్స్

హోండా ఎక్స్-బ్లేడ్ బైకులో ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. పొజిన్ ల్యాంప్‌తో సహా ఫస్ట్-ఇన్ సెగ్మెంట్ ఫుల్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, ఎల్ఇడి టెయిల్‌లైట్లు, మరియు గేర్ పొజిషన్ ఇండికేటర్ మరియు సర్వీస్ డ్యూ ఇండికేటర్ గల సరికొత్త డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్లు ఉన్నాయి.

హోండా ఎక్స్-బ్లేడ్ బుకింగ్స్

హోండా ఎక్స్-బ్లేడ్ బైకులో అగ్రెసివ్ రేజర్ షార్క్ డిజైన్ కలదు. తక్కువ ఇంజన్ కెపాసిటి గల కమ్యూటర్ మోటార్ సైకిళ్లను కోరుకునే యువ కొనుగోలుదారులను టార్గెట్ చేసుకుని ఎక్స్-బ్లేడ్ బైకును అభివృద్ది చేసింది.

హోండా ఎక్స్-బ్లేడ్ బుకింగ్స్

ఫ్రంట్ డిజైన్‌లో రోబో-ఫేస్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్ సెటప్, కండలు తిరిగిన ఫ్యూయల్ ట్యాంక్, పదునైన బాడీ డీకాల్స్ వంటివి ఎక్స్-బ్లేడ్ బైక్ మొత్తానికి స్టైలిష్ అండ్ అగ్రెసివ్ లుక్ తీసుకొచ్చింది.

హోండా ఎక్స్-బ్లేడ్ బుకింగ్స్

హోండా ఎక్స్-బ్లేడ్ రియర్ డిజైన్‌లో పదునైన స్ల్పిట్ గ్రాబ్ హ్యాండిల్స్, విభిన్నమైన ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ సెటప్, డ్యూయల్ అవుట్-పుట్ మఫ్లర్ మరియు విశాలమైన టైర్లు ఉన్నాయి.

హోండా ఎక్స్-బ్లేడ్ బుకింగ్స్

మార్చి 2018 మొదటి వారంలో విడుదలవుతున్న హోండా ఎక్స్-బ్లేడ్ ఐదు విభిన్న రంగుల్లో లభ్యం కానుంది. అవి, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, మ్యాట్ ఫ్రాజెన్ సిల్వర్ మెటాలిక్, పర్ల్ స్పార్టాన్ రెడ్, పర్ల్ ఇగ్నియస్ బ్లాక్ మరియు మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్.

హోండా ఎక్స్-బ్లేడ్ బుకింగ్స్

సాంకేతికంగా హోండా ఎక్స్-బ్లేడ్ బైకులో సిబి హార్నెట్ 160ఆర్ నుండి సేకరించిన అదే 162.7సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇంజన్ ఉత్పత్తి చేసే 8,500ఆర్‌పిఎమ్ వద్ద 13.93బిహెచ్‌పి పవర్ మరియు 6,000ఆర్‌పిఎమ్ వద్ద 13.9ఎన్ఎమ్ టార్క్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ నుండి రియర్ వీల్‌కు చేరుతుంది.

హోండా ఎక్స్-బ్లేడ్ బుకింగ్స్

హోండా ఎక్స్-బ్లేడ్ బైకును డైమండ్-ఫ్రేమ్ ఛాసిస్ మీద నిర్మించింది. సస్పెన్షన్ కోసం ముందువైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ కలదు.

హోండా ఎక్స్-బ్లేడ్ బుకింగ్స్

ఎక్స్-బ్లేడ్‌లో ఇరువైపులా 17-అంగుళాల అళ్లాయ్ వీల్స్, ఫ్రంట్ వీల్‌కు 80/110 ఆర్17 మరియు రియర్ వీల్‌కు 130/70 ఆర్17 కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి. బ్రేకింగ్ విధుల కోసం ఫ్రంట్ వీల్‌కు డిస్క్ మరియు రియర్ వీల్‌కు డ్రమ్ బ్రేక్ అందివ్వడం జరిగింది.

హోండా ఎక్స్-బ్లేడ్ బుకింగ్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2018లో ఎక్స్-బ్లేడ్ బైకును ప్రదర్శించినపుడు సందర్శకుల నుండి భారీ ఆదరణ లభించింది. దీనిని దృష్టిలో ఉన్న వెనువెంటనే ఎక్స్-బ్లేడ్ మీద బుకింగ్స్ ప్రారంభించింది.

ఇండియన్ మార్కెట్లో 160సీసీ కమ్యూటర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ఇప్పటికే ఉన్న హార్నెట్ 160, యూనికార్న్ 160 బైకులకు తోడుగా స్పోర్టివ్ స్టైల్ కమ్యూటర్ వెర్షన్ ఎక్స్-బ్లేడ్ బైకును రూపొందించింది. ఇది పూర్తి స్థాయిలో విడుదలైతే యువ కొనుగోలుదారుల నుండి మంచి ఆదరణ లభించనుంది.

Most Read Articles

Read more on: #hyundai #హోండా
English summary
Read In Telugu: Honda X-Blade Bookings Open - To Be Priced Below Rs 79,000 With 5 Colour Options
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X