అభివృద్ధి దశలో 899సీసీ డ్యూకాటి పనిగేల్ స్పోర్ట్స్ బైక్

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ 'ఆడి' స్వాధీనం చేసుకున్న ఇటాలియన్ మోటార్‌సైకిల్ కంపెనీ 'డ్యుకాటి' అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ సూపర్ స్పోర్ట్స్ బైక్ '1199 పనిగేల్' (1199 Panigale)లో తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన ఓ వేరియంట్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న డ్యుకాటి 1199 పనిగేల్ సూపర్ స్పోర్ట్స్ బైక్‌లో శక్తివంతమైన ట్విన్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10,750 ఆర్‌పిఎమ్ వద్ద 195 హార్స్ పవర్‌ల శక్తిని, 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 133 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 300 కిలోమీటర్లు.

Ducati Panigale

కాగా.. దీనికన్నా తక్కువ ఇంజన్ సామర్థ్యం చిన్న పనిగేల్‌ను డ్యూకాటి అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం డ్యుకాడి అందిస్తున్న 848 రేంజ్ స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్లను రీప్లేస్ చేసేలా ఈ కొత్త పనిగేల్ రానుంది. ఇందులో 1199కు చెందిన సూపర్‌క్వాడ్రో ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసిన 899సీసీ, ఫోర్-స్ట్రోక్, వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజన్ 150 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేయవచ్చని అంచనా.

రెగ్యులర్ వెర్షన్ 1199 పనిగేల్‌లో ఉండే అనేక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఫీచర్లను 899సీసీ పనిగేల్‌లో గమనించవచ్చు. ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వేరియబల్ రైడింగ్ మోడ్స్, క్విక్ షిఫ్టర్ వంటి ఫీచర్లు ఈ స్మాల్ పనిగేల్‌లో ఉండనున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Most Read Articles

English summary
According to recent reports, Italian two-wheeler manufacturer Ducati is developing a smaller version of its flagship supersports bike, the 1199 Panigale. The new capacity reduced Panigale is expected to replace its successful 848 range of sports motorcycles. Stay tuned for latest updates.
Story first published: Tuesday, August 27, 2013, 12:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X