భారత మార్కెట్ నుంచి తొలగిపోయిన డిస్కవర్ 125 ఎస్‌టి!

By Ravi

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో, భారత మార్కెట్లో డిస్కవర్ 125 ఎస్‌టి మోడల్ విక్రయాలను నిలిపివేసినట్లు సమాచారం. అయితే, ఈ మోడల్ విదేశాలకు ఎగుమతి చేయటం మాత్రం యధావిధిగా కొనసాగుతుందని తెలుస్తోంది.

బజాజ్ ఆటో తొలిసారిగా మే 2012లో 'డిస్కవర్ 125 ఎస్‌టి' (స్పోర్ట్స్ టూరర్) మోడల్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది. ఈ విభాగంలోనే మొదటిసారిగా డిటిఎస్-ట్విన్ స్పార్క్ టెక్నాలజీ కలిగిన ఇంజన్‌ను ఈ బైక్‌లో ఉపయోగించారు.

డిస్కవరీ బ్రాండ్‌లో ఇదే టాప్ వేరియంట్. బడ్జెట్ కేటగిరీలో ప్రీమియం ఫీచర్లను ఆఫర్ చేసేలా ఈ బైక్‌ను తయారు చేశారు. అయితే, దేశీయ విపణిలో ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగకపోవటంతో, దీని అమ్మకాలను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది.

Bajaj Discover 125 ST

ఇందులో ఉపయోగించిన 124.6సీసీ, 4 వాల్వ్ ట్విన్ స్పార్క్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 9000 ఆర్‌పిఎమ్ వద్ద 13 పిఎస్‌ల శక్తిని, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 1.1 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

స్పోర్టీ లుక్‌నిచ్చే కొత్త డిస్కవర్ 125 ఎస్‌టిలో 5-స్పీడ్ గేర్ బాక్స్, రీడిజైన్ చేయబడిన ఫ్యూయెల్ ట్యాంక్, షార్ప్ ఎడ్జ్‌లు కలిగిన పవర్‌ఫుల్ హెడ్‌ల్యాంప్, స్టయిలిష్ అల్లాయ్ వీల్స్, మోనోషాక్ సస్పెన్షన్, ఎలాంటి రోడ్లపై అయినా సౌకర్యవంతంగా ప్రయాణించేలా రూపొందించిన యాంటీ వైబ్రేషన్ ఫ్రేమ్, మరింత సురక్షితమైన బ్రేకింగ్ కోసం అమర్చిన పెటల్ డిస్క్ బ్రేక్ వంటి మార్పులను గమనించవచ్చు.

Most Read Articles

English summary
Bajaj is rumoured to have stopped selling the Discover 125 ST in India. Sales are expected to continue until stocks last, while production of the product will continue to cater to overseas markets to where it is exported.
Story first published: Tuesday, April 29, 2014, 11:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X