150సీసీ బజాజ్ డిస్కవర్ 'బ్లాక్‌బస్టర్ బైక్' వస్తోంది!

By Ravi

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన సంస్థ (అమ్మకాల పరంగా) బజాజ్ ఆటో గ్లోబల్ మోటార్‌సైకిల్ కంపెనీగా ఎదగాలనే కృతనిశ్చయంతో ఉంది. ఇదే సమయంలో డొమెస్టిక్ మార్కెట్‌పై కూడా కంపెనీ ప్రత్యేక దృష్టి సారించనుంది. ఇందులో భాగంగానే, దేశీయ మార్కెట్లో అమ్మకాలను పెంచుకునేందుకు 150సీసీ సెగ్మెంట్లో ఓ 'బ్లాక్‌బస్టర్ ఉత్పత్తి'ని అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఇది కూడా చదవండి: హీరో ప్యాషన్ ప్రో టిఆర్ డిటేల్స్

150సీసీ సెగ్మెంట్లో బ్లాక్‌బస్టర్ ఉత్పత్తి అంటే బహుశా బజాజ్ డిస్కవర్ 150 బైక్ అయి ఉండొచ్చని సమాచారం. మాస్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న పల్సర్ 150 బైక్‌కు దిగువన అత్యంత సరసమైన ధరకే ఈ డిస్కవర్ 150సీసీ బైక్ విడుదల కావచ్చని అంచనా. బజాజ్ విడుదల చేసిన మోడ్రన్ డిస్కవర్ 100, డిస్కవర్ 125 మోడళ్లు ఇప్పటికే మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసినదే.

Discover 125

ఈ నేపథ్యంలో, డిస్కవరీ బ్రాండ్‌లో రానున్న 150సీసీ బైక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మోడల్‌కు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, దీనికి 'డిస్కవర్ ఎఫ్150' అనే పేరును పెట్టే అవకాశం ఉంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, మోనోషా రియర్ సప్సెన్షన్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయని సమాచారం.

ఇది కూడా చదవండి: వెస్పా లిమిటెడ్ ఎడిషన్ డిటేల్స్

ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న టాప్-ఎండ్ వేరియంట్ డిస్కవర్ 125ఎస్‌టి మోడల్ ఆధారంగా చేసుకొని ఈ కొత్త బైక్‌ను డిజైన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో కొత్త 4-వాల్వ్, 150సీసీ, సింగిల్ సిలిండర్, డిసిఎస్-ఐ ఇంజన్‌ను ఉపయోగించనున్నారని సమచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 14 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

Bajaj Discover Cover

అత్యుత్తమ మోటార్‌సైకిల్ ఉత్పత్తులతో తాము ఓ ప్రపంచ కంపెనీగా అవతరించాలనుకుంటున్నామని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ తమ కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో వెల్లడించారు. ప్రపంచపు మోటార్‌సైకిల్ రాజధానిగా ఇండియాను తీర్చిదిద్దాలనేదే తమ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. జర్మనీలో కార్లు, స్కాట్‌లాండ్‌లో స్కాచ్, స్విట్జర్లాండ్‌లో చీజ్ పాపులర్ అయినట్లుగానే ఇండియాలో మోటార్‌సైకిళ్లు పాపలర్ కావాలని అన్నారు.

ఇది కూడా చదవండి: BMW R NineT బైక్ విడుదల

బజాజ్ అందిస్తున్న ఉత్పత్తులలో పల్సర్, డిస్కవర్ బ్రాండ్‌లు ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులర్ అయ్యాయి. బజాజ్ భారతదేశంలో కెల్లా నెంబర్ వన్ ద్విచక్ర వాహన ఎగుమతి దారుగా ఎదిగింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో బజాజ్ ఆటో ఎగుమతులు 2.3 శాతం వృద్ధి చెంది 13.23 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. దాదాపు 60 దేశాలకు బజాజ్ ఆటో తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది.

Most Read Articles

English summary
Bajaj Auto plans to create a new segment in the 150cc commuter motorcycle with a “blockbuster product” (maybe Discover 150) for the domestic market to boost sales. Stay tuned for latest updates.
Story first published: Tuesday, July 22, 2014, 12:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X