'బజాజ్ పల్సర్ 220ఎఫ్'లో కూడా డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్

By Ravi

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో తమ పల్సర్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను మొత్తం డ్యూయెల్ టోన్ కలర్‌తో అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇటీవలే పల్సర్ 180 మోడల్‌లో డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టిన బజాజ్ ఆటో తాజాగా, పల్సర్ 220ఎఫ్ మోడల్‌లో కూడా కొత్త డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది.

పల్సర్ 180 వేరియంట్ మాదిరిగానే పల్సర్ 220ఎఫ్ కూడా మూడు విభిన్న డ్యూయెల్ టోన్ కలర్లలో లభ్యమవుతుంది. అయితే, దీని డిజైన్ మరియు ఇంజన్ పెర్ఫార్మెన్స్‌లలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. మరిన్ని వివరాలను, ఫొటోలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

పల్సర్ 220ఎఫ్ సఫైర్ బ్లూ

పల్సర్ 220ఎఫ్ సఫైర్ బ్లూ

పల్సర్ 220ఎఫ్ బైక్‌లో కొత్త కలర్ ఆప్షన్స్ తప్ప ఎలాంటి కాస్మోటిక్ ఛేంజెస్ కానీ మెకానికల్ ఛేంజెస్ కానీ లేవు. ఇందులో 220సీసీ సింగిల్ సిలిండర్, డిటిఎస్-ఐ, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు.

పల్సర్ 220ఎఫ్ కాక్‌టెయిల్ వైన్ రెడ్

పల్సర్ 220ఎఫ్ కాక్‌టెయిల్ వైన్ రెడ్

ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 21.05 పిఎస్‌ల శక్తిని, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 19.12 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పల్సర్ 220ఎఫ్ పెరల్ మెటాలిక్ వైట్

పల్సర్ 220ఎఫ్ పెరల్ మెటాలిక్ వైట్

త్వరలోనే పల్సర్ 200ఎన్ఎస్ (నేక్డ్ బైక్)కు స్పోర్ట్ వెర్షన్ (ఫెయిర్డ్ బైక్) 200ఎస్ఎస్ మరియు పల్సర్ 180 కన్నా పవర్‌ఫుల్ బైక్‌‌లు మార్కెట్లోకి రానున్న నేపథ్యంలో, ఈ పల్సర్ 220ఎఫ్ భవిష్యత్ అగమ్యగోచరంగా మారే అవకాశం ఉంది.

బజాజ్ పల్సర్ 180

బజాజ్ పల్సర్ 180

ఇది కూడా చదవండి: డ్యూయెల్ టోన్ బజాజ్ పల్సర్ 180

Most Read Articles

English summary
Bajaj has taken to adding new dual colour schemes to the Pulsar range in a bid to make them more appealing to potential customers. It first started with the Pulsar 200NS and then yesterday we told you about the addition of dual tone exterior to the Pulsar 180. The latest model to receive new dual tone skins is the Pulsar 220F. 
Story first published: Wednesday, April 9, 2014, 16:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X