ఆటో ఎక్స్‌పో 2014లో బజాజ్ నుంచి 3 కొత్త మోడల్స్

By Ravi

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో మూడు కొత్త ద్విచక్ర వాహనాలను ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఇందులో ఒకటి ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న పల్సర్ బైక్‌లన్నింటి కన్నా పెద్ద ఇంజన్ కలిగిన స్పోర్టీ వెర్షన్ పల్సర్ ఉంటుందని తెలుస్తోంది. మిగిలిన రెండింటిలో కూడా మరొక రకం పల్సర్, ఓ డిస్కవర్ వేరియంట్ ఉంటాయని పరిశ్రమ వర్గాల సమాచారం.

బజాజ్ ఆటో లిమిటెడ్, 2వీలర్స్ సెక్షన్ మార్కెటింగ్ మేనేజర్ శ్యామ్ సుందర్ నారాయన్, కోయంబత్తూర్‌లో జరిగిన పల్సర్ స్టంట్ మానియా కార్యక్రమాన్ని పురస్కరించుకొని, ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది మూడు కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తామని, అందులో కనీసం ఒకటైనా 2014లో భారత రోడ్లపైకి వస్తుందని ఆయన తెలిపారు.

Pulsar

బజాజ్ ఆటో ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయిస్తున్న 200సీసీ పల్సర్ 200ఎన్ఎస్ (నేక్డ్ స్పోర్ట్స్) బైక్‌ను ఆధారంగా చేసుకొని, కంపెనీ ఇందులో ఓ ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్ బైక్ (బాడీ ప్యానెల్స్ లేని బైక్‌ను నేక్డ్ బైక్ అని, పూర్తి బాడీ ప్యానెల్స్ కలిగిన బైక్‌ను ఫెయిర్డ్ బైక్ అని పిలుస్తారు) అభివృద్ధి చేస్తోంది. ఈ బైక్‌కు 'పల్సర్ ఎస్ఎస్' (Pulsar SS) అనే పేరును ఉపయోగించనున్నట్లు సమాచారం.

బజాజ్ నుంచి మార్కెట్లోకి రానున్న ఈ మూడు కొత్త ఉత్పత్తుల్లో ముందుగా ఈ ఫుల్ ఫెయిర్డ్ పల్సర్ స్పోర్ట్స్ బైక్ మార్కెట్లో వస్తుందని అంచనా. అలాగే, ప్రీమియం బైక్ సెగ్మెంట్లోని డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు బజాజ్ ఆటో ఓ పెద్ద ఇంజన్ కలిగిన పల్సర్‌ను తయారు చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో పల్సర్ 375 కూడా విడుదల కావచ్చని సమాచారం. ఈ బైక్‌లకు సంబంధించిన అన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Bajaj Auto will showcase three new two wheeler models at the 2014 Indian Auto Expo in Delhi this coming February, a senior company executive has revealed. From several earlier reports and spy shots of upcoming Pulsar models we know that two of the expected three models will be Pulsars.
Story first published: Friday, December 27, 2013, 10:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X