బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ నుంచి 'ఆర్ నైన్‌టి' బైక్ విడుదల

By Ravi

జర్మన్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ భారత మార్కెట్లో మరో సరికొత్త లగ్జరీ బైక్‌ను ప్రవేశపెట్టింది. కెఫే రేసర్ స్టయిల్‌లో ఉండే బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి (BMW R nineT) మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది. క్లాసిక్ లుక్, మోడ్రన్ ఇంజన్‌తో ఈ బైక్‌ను తయారు చేశారు.

ఇది కూడా చదవండి: ప్రపంచంలో కెల్లా 10 అతిపెద్ద షిప్పింగ్ కంపెనీలు

భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి బైక్ ధర రూ.23.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది. ఇందులో 1170సీసీ, 4-స్ట్రోక్, ఎయిర్/ఆయిల్ కూల్డ్, ఫ్లాట్ ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్‌నే బాక్సర్ ఇంజన్ అని కూడా పిలుస్తుంటారు.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి బైక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి

తర్వాతి స్లైడ్‌లలో బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి బైక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోండి.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి

ఇందులో ఉపయోగించిన 1170సీసీ, 4-స్ట్రోక్, ఎయిర్/ఆయిల్ కూల్డ్, ఫ్లాట్ ట్విన్ ఇంజన్ గరిష్టంగా 110 పిఎస్‌ల శక్తిని, 119 ఎన్ఎమ్‌‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ కాన్స్టాంట్ మెష్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి బైక్ గరిష్ట వేగం గంటకు 200 కి.మీ. ప్రతి 100 కిలోమీటర్ల దూరానికి ఇది 4.5 లీటర్ల ఇంధనాన్ని వినియోగించుకుంటుంది (22.22 కెఎమ్‌పిఎల్ మైలేజ్).

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి

కెఫే రేసర్ స్టయిల్‌లో ఈ నేక్డ్ మోటార్‌సైకిల్ బరువు 222 కేజీలు. దీనిని ట్యూబ్లర్ స్టీల్ ఫ్రేమ్‌పై తయారు చేశారు. దీని రైడ్ హైట్ 785 మి.మీ. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్లు.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి

అన్ని ఇతర బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే ఈ ఆర్ నైన్‌టి బైక్ కూడా ఏబిఎస్ ఫీచర్‌తో లభిస్తుంది. ఇందులో ముందు వైపు డ్యూయెల్ డిస్క్, వెనుక వైపు సింగ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి బైక్ ఛాస్సిస్‌ను నాలుగు సెక్షన్లుగా విభజించారు. ఇందులో ఒక సెక్షన్ ముందు వైపు, మిగిలిన మూడు సెక్షన్లు వెనుక వైపు ఉంటాయి. ఇందులోని పిలియన్ రైడర్ సెక్షన్‌ను తొలగించి, సింగిల్ సీటర్ బైక్‌గా మార్చుకోవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి

ఆర్ నైన్‌టి బైక్ కోసం బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ అనేక కస్టమైజేషన్ ఆఫర్లను అందిస్తోంది. వినియోగదారులు తమ అభిరుచికి తగినట్లుగా ఈ బైక్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
BMW Motorrad has now launched a more humble motorcycle in the Indian market. The Germans have christened it the R nineT, it is a naked street motorcycle. It It is the best of both worlds, as it ha typical retro BMW design with a modern engine underneath its skin.
Story first published: Saturday, July 19, 2014, 9:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X