క్రూయిజ్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను ఆవిష్కరించిన బిఎమ్‌డబ్ల్యూ

జర్మన్ లగ్జరీ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ తన జీరో ఎమిషన్ వాహనాల ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మరొక ఉత్పత్తి ని చేర్చుకుంది. ఇందులో భాగంగా, బిఎమ్‌డబ్ల్యూ తమ తొలి పెడలెక్ (పెడల్ పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ పవర్) టూవీలర్ 'క్రూజ్'ను ఆవిష్కరిచింది. ఇదొక హైబ్రిడ్ సైకిల్. ఈ సైకిల్‌ను ఓపిక ఉంటే సాధారణ సైకిల్ మాదిరిగా పెడల్స్ సాయంతో నడపవచ్చు లేదంటే ఇందులో బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ల సాయంతో చిన్న స్విచ్‌ను నొక్కటం ద్వారా యాంత్రికంగాను నడపవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ క్రూయిజ్ సైకిల్‌లో బాష్ 250 వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో పని చేస్తుంది. ఈ సైకిల్ గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇది ఎకో, టూర్, స్పోర్ట్, టర్బో అనే నాలుగు రైడింగ్ మోడ్ ఆప్షన్లతో లభిస్తుంది. నడిపే రోడ్డును బట్టి ఈ రైడింగ్ మోడ్‌ను ఎంచుకోవచ్చు. ఈ బ్యాటరీ సాయంతో సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

ప్రారంభంలో భాగంగా, కేవలం 1,000 యూనిట్ల క్రూయిజ్ సైకిళ్లను మాత్రమే బిఎమ్‌డబ్ల్యూ తయారు చేయనుంది మరియు ఇవి జర్మనీలో మాత్రమే అమ్ముడు కానున్నాయి. ఈ సైకిల్‌కు సంబంధించిన ధర మరియు ఇతర సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈలోపుగా బిఎమ్‌డబ్ల్యూ క్రూయిజ్ సైకిల్‌పై ఓ లుక్కేసొద్దాం రండి..!

బిఎమ్‌డబ్ల్యూ క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్

బిఎమ్‌డబ్ల్యూ క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్

బిఎమ్‌డబ్ల్యూ క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్

బిఎమ్‌డబ్ల్యూ క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్

బిఎమ్‌డబ్ల్యూ క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్

బిఎమ్‌డబ్ల్యూ క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్

బిఎమ్‌డబ్ల్యూ క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్

బిఎమ్‌డబ్ల్యూ క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్

బిఎమ్‌డబ్ల్యూ క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్

బిఎమ్‌డబ్ల్యూ క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్

బిఎమ్‌డబ్ల్యూ క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్

బిఎమ్‌డబ్ల్యూ క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్

బిఎమ్‌డబ్ల్యూ క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్

బిఎమ్‌డబ్ల్యూ క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్

Most Read Articles

English summary
BMW has unveiled its first pedelec (Pedal plus Electric powered) two wheeler called as the 'Cruise'. It is powered by the Bosch 250W motor that offers assistance directly to the crank set at speeds up to 25 kmph.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X