మోటార్‌సైకిళ్ల కోసం లో-కాస్ట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ యూనిట్స్

ఒకప్పుడు కార్లకు మాత్రమే పరిమితమైన ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్స్‌ను ఇప్పుడు ద్విచక్ర వాహన తయారీదారులు మోటార్‌సైకిళ్లలో కూడా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా టూవీలర్లలో కంపెనీలు కార్బురేటర్లను ఉపయోగిస్తుంటారు. అయితే, ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను ఉపయోగించడం వలన బైక్ పెర్ఫార్మెన్స్ పెరగటంతో పాటు మైలేజ్ కూడా పెరుగుతుంది.

అంతేకాకుండా, ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్ వలన ఇంజన్ జీవితకాలం పెరుగుతుంది మరియు దీని మెయింటినెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ వీటి ధరలు మాత్రం కార్బురేటర్ మోటార్‌సైకిళ్ల ధరల కన్నా ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగి మోటార్‌సైకిళ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. దేశీయ మార్కెట్లో బడ్జెట్ మోటార్‌సైకిళ్లదే హావా.

ఈ నేపథ్యంలో, బడ్జెట్ మోటార్‌సైకిళ్లలో సైతం ఫ్యూయెల్ ఇంజెక్షన్ యూనిట్లను ఉపయోగించేలా, ప్రముఖ విడిభాగాల తయారీ సంస్థ బోష్ తక్కువ ధర కలిగిన ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తోంది. సింగిల్ సిలిండర్ ఇంజన్ల కోసం డిజైన్ చేయబడిన ఈ లో-కాస్ట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ యూనిట్ యాంత్రికంగా నియంత్రించబడుతుంది (ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్). దీని ధర సుమారు కార్బురేటర్ల మాదిరిగానే ఉంటుంది.

Bosch Low Cost Fuel Injection

అంటే, సాధారణ మోటార్‌సైకిళ్లలో కార్బురేటర్లను ఉపయోగించడానికి బదులుగా ఈ లో-కాస్ట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌లను ఉపయోగించవచ్చు అన్నమాట. అంతేకాదు, ఈ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను అప్లికేషన్ సాయంతో మీ స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ, ట్రిమ్ ఇన్ఫర్మేషన్ వంటి సమాచారం పొందవచ్చు.

ప్రత్యేకించి ఈ యాప్ సాయంతో ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను డిస్ఎంగేజ్ (ట్యాంక్ నుంచి ఇంజన్‌కు ఇంధన సరఫరా నిలిపివేయటం) కూడా చేయవచ్చు. దీని వలన బైక్ చోరీకి గురయ్యే ప్రమాదం ఉండదు. ఆసియా మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని బోష్ ఈ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, ఇక మోటార్‌సైకిళ్లలో మైలేజే.. మైలేజ్!

Most Read Articles

English summary
India is home to one of the world's largest number of low displacement commuter motorcycles and automatic scooters. However, manufacturer continue to equip these two wheelers with carburettors to supply fuel to the engine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X