భారత్‌లో క్యాస్ట్రాల్ - ట్రైయంప్ కంపెనీల మధ్య ఒప్పందం

By Ravi

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇంజన్ ఆయిల్ తయారీ కంపెనీలలో ఒకటైన క్యాస్ట్రాల్ మరియు బ్రిటన్‌కు ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిల్ కంపెనీ ట్రైయంప్‌ల మధ్య భారత్‌లో ఓ ఒప్పందం కుదింరింది. ఈమేరకు ఇరు సంస్థల తమ భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.

ఈ ఒప్పందం ప్రకారం, భారత్‌లోని ట్రైయంప్ మోటార్‌సైకిళ్లకు క్యాస్ట్రాల్ ఇంజన్ ఆయిల్స్‌ను మాత్రమే ఉపయోగించనున్నారు. ఈమేరకు ట్రైయంప్‌కు సోల్ ఇంజన్ ఆయిల్ సప్లయర్‌గా క్యాస్ట్రాల్ ఇండియా వ్యవహరించనుంది.

అలాగే, ట్రైయంప్ కూడా తమ మోటార్‌సైకిళ్లతో పాటుగా క్యాస్ట్రాల్ ఇంజన్ ఆయిల్స్‌ను కూడా ప్రమోట్ చేయనుంది. అలాగే, భవిష్యత్తులో ట్రైయంప్‌కు క్యాస్ట్రాల్ తమ సాంకేతిక మద్ధతును కూడా అందించనుంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

క్యాస్ట్రాల్ - ట్రైయంప్ డీల్..

తర్వాతి స్లైడ్‌లలో క్యాస్ట్రాల్, ట్రైయంప్‌ల మధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.

క్యాస్ట్రాల్ - ట్రైయంప్ డీల్..

ఈ ఒప్పందంపై క్యాస్ట్రాల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రవి కిర్పలాని మాట్లాడుతూ.. భారత్‌లో ట్రైయంప్ స్థిరత్వాన్ని ఏర్పరుచుకుంటున్న నేపథ్యంలో, రెండు ఐకానిక్ బ్రాండ్లు చేతులు కలపటం సాధారణని అన్నారు. క్యాస్ట్రాల్ ఇక్కడ (భారత్‌లో) దాదాపు వందేళ్లకు పైగా ఉందని, మార్కెటింగ్ కోసం ట్రైయంప్‌కు కావల్సిన మద్ధతును అందించడం సంతోషంగా ఉందని అన్నారు.

క్యాస్ట్రాల్ - ట్రైయంప్ డీల్..

కాగా.. ఈ ఒప్పందం గురించి ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విమల్ సంబ్లీ మాట్లాడుతూ.. క్యాస్ట్రాల్ లాంటి ప్రముఖ బ్రాండ్‌తో టైఅప్ పెట్టుకోవటం చాలా సంతోషంగా ఉందని, ట్రైయంప్ భారత్‌లో కంప్లీట్ రైడింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేందుకు కట్టుబడి ఉందని, ఈ భాగస్వామ్యం ద్వారా తమ కట్టుబాటు మరింత ధృడమవుతుందని అన్నారు.

ట్రైయంప్ రాకెట్ పవర్డ్ బైక్

ట్రైయంప్ రాకెట్ పవర్డ్ బైక్

క్యాస్ట్రాల్, ట్రైయంప్‌లు ఫాస్టెస్ట్ స్ట్రీమ్‌లైన్డ్ మోటార్‌సైకిల్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. దాదాపు 1000 బిహెచ్‌పిలకు పైగా శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్ కలిగిన ఈ రాకెట్ పవర్డ్ మోటార్‌సైకిల్‌ను బోన్‌విల్లేలోని ఉప్పు తెన్నులపై టెస్ట్ చేయనున్నారు. ఈ ట్రైయంప్ రాకెట్ గంటకు 400 మైళ్ల కన్నా (643.738 కి.మీ.) ఎక్కువ వేగంతో ప్రయాణించి రికార్డు బ్రేక్ చేయనుంది.

టైగర్ సిరీస్

టైగర్ సిరీస్

టైగర్ సిరీస్ మోటార్‌సైకిళ్లు అడ్వెంచర్ బైక్స్. ఇవి 800సీసీ, 95 పిఎస్ పవర్ మరియు 1215సీసీ, 137 పిఎస్ పవర్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి. ఈ రెండు బైక్‌లు కూడా 3-సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి.

క్లాసిక్ రేంజ్

క్లాసిక్ రేంజ్

ఇందులో మూడు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అవి - బోన్‌విల్లే, బోన్‌విల్లో టి100, త్రక్స్టన్. ఇందులో 865సీసీ, ఎయిర్-కూల్డ్, పారలల్-ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

స్ట్రీట్ ట్రిపుల్

స్ట్రీట్ ట్రిపుల్

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ కూడా రెండు వెర్షన్లలో లభిస్తుంది. ఇందులో ఒకటి 675సీసీ 106 పిఎస్ ఇంజన్ మరొకటి 1050సీసీ 135 పిఎస్ ఇంజన్. ఈ బైక్స్ లిక్విడ్ కూల్డ్, 3-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి.

స్పోర్ట్

స్పోర్ట్

డేటోనా ట్రైయంప్‌కు అత్యంత పాపులర్ బైక్. ఇందులో ఇన్‌లైన్ 3-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ 675సీసీ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 128 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఏబిఎస్ (ఆప్షనల్ ఫీచర్)తో కూడా లభిస్తుంది.

టూరింగ్

టూరింగ్

లీజర్ బైకింగ్ కోసం కూడా ట్రైయంప్ ఉత్పత్తలను అందిస్తోంది. ఇందులోని థండర్‌బర్డ్ స్టోర్మ్ పారలల్ ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 98 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ సిరీస్‌లో రెండవ బైక్ రాకెట్ 3. ట్రైయంప్ బైక్‌లలో కెల్లా అత్యంత పవర్‌ఫుల్ బైక్ ఇది. ఇందులోని ఇన్‌లైన్ 3-సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 148 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
There are loads of new agreements, partnerships and deals that go on in the automobile industry every day. Rarely as spectacular as two iconic brands like Castrol India and Triumph Motorcycles UK coming together though. These two giants have signed for partnership in India.
Story first published: Wednesday, July 9, 2014, 11:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X