మహిళల కోసం ప్రత్యేక సేఫ్టీ ఫీచర్లతో తయారు చేసిన 'నిర్భయ స్కూటర్'

By Ravi

ఇండో-జపనీస్ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ మారెల్లో యమాసకి ప్రత్యేకించి భారతీయ మహిళల కోసం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఈ స్కూటర్‌కు కంపెనీ 'నిర్భయ' అనే పేరును ఖరారు చేసింది. ఈ నిర్భయ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మహిళల భద్రత కోసం పలు భద్రతా ఫీచర్లను ఆఫర్ చేయనున్నారు.

నిర్భయ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇన్-బిల్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ (జిపిఆర్ఎస్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్) ఉంటుంది. దీని సాయంతో స్కూటర్ ఏ ప్రాంతంలో ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఈ స్కూటర్ కోసం ఓ ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేయనున్నారు.

Nirbhaya Scooter

ఈ స్కూటర్‌లో ఓ ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ బటన్ కూడా ఉంటుంది. ఈ ఎస్ఓఎస్ బటన్ జిపిఆర్ఎస్ ద్వారా మహిళా రైడర్ ఫోన్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ బటన్‌ను ప్రెస్ చేయగానే ఏకకాలంలో ఆరు విభిన్న మొబైల్ నెంబర్లకు మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా పంపబడుతాయి.

నిర్భయ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు, ఈ స్కూటర్‌ను నడిపేందుకు మహిళలు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.35,000 రేంజ్‌లో అందించాలని, మహిళా కస్టమర్లకు 10 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేయాలని యోచిస్తున్నామని మోరెల్లో యమసకి సీఈఓ రజిత్ ఆర్. ఆర్య తెలిపారు.

Most Read Articles

English summary
Indo-Japanese electric Two Wheeler Manufacturer Company, Morello Yamasaki has developed a new scooter especially for women rides. Named as Nirbhaya, this scooter is will have special safety features for woman.
Story first published: Thursday, August 21, 2014, 11:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X