క్రూయిజ్ ఇండియా టూర్ బైక్ షో షురూ..!

By Ravi

బైకింగ్ గ్రూప్స్‌కు ఓ గుడ్ న్యూస్. 'క్రూయిజ్ ఇండియా టూర్ బైక్ షో' తమ మొట్టమొదటి ఎడిషన్‌ను ముంబైలో ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాన్ని బ్రాండ్ కన్సల్టింగ్ సంస్థ అజూర్ మార్కామ్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 17, 2014వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 23, 2014వ తేదీ వరకు జరుగుతుంది.

ముంబైలోని లోవర్ పరేల్ వద్ద ఉన్న హై స్ట్రీట్ ఫోనిక్స్ మాల్ వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది. బైకింగ్ గ్రూప్స్ అన్ని ఒకే ప్రాంతం వద్ద సమావేశమయ్యేందుకు మరియు తమ నెట్‌వర్క్ పరిచయాలను మరింత పెంపొందించుకునేందుకు ఏడు రోజుల పాటు జరిగే ఈ క్రూయిజ్ ఇండియా టూర్ బైక్ షో చక్కని వేదికగా నిలుస్తుంది.


ఈ క్రూయిజ్ ఇండియా టూర్ బైక్ షో కార్యక్రమంలో వింటేజ్ బైక్ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో సూపర్‌బైక్స్, లగ్జరీ క్రూజర్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే, కస్టమ్ బైక్స్‌కు సంబంధించి ఓ ప్రత్యేక విభాగం కూడా ఉంటుంది. అంతేకాకుండా.. రాక్ షోస్, టాటూ వర్క్‌షాప్స్, స్టంట్ షో, ఎమ్ఎమ్ఏ ఫైట్స్ వంటి పలు కార్యక్రమాలు కూడా ఉంటాయి.

బైకర్ల ద్వారా తీసిన ఫొటోగ్రాఫ్‍‌లతో ఓ ప్రదర్శన కూడా నిర్వహించడం జరుగుతుంది. లీడింగ్ ఉమెన్స్ బైక్ రైడ్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో రేడియో సిటీ ఆర్జే అర్చన కూడా పాల్గొంటుంది. మహిళా సాధికారతను ప్రచారం చేసేందుకు ఈ రైడ్‌ను నిర్వహిస్తారు. వేలాది మంది బైకర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు ఆశిస్తున్నారు.

Cruise India Tour Bike Show To Be Held In Mumbai

తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ క్రూయిజ్ ఇండియా టూర్ బైక్ షోకు సుమారు 6 లక్షల మంది వీక్షకలు రావచ్చని అంచనా. కాగా.. ఇందులో క్రూయిజ్ ఇండియా టూర్ ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమవుతుంది. ఇందులో మోటార్‌సైక్లిస్టులు తమ ద్విచక్ర వాహనాలపై దేశవ్యాప్తంగా 8,000 కిలోమీటర్ల దూరాన్ని చుట్టిరానున్నారు.
Most Read Articles

English summary
Cruise India Tour Bike Show will begin it's first edition in Mumbai, the event is being organised by a brand consulting firm, Azure MarCom. The event commences on 17th of February and will be held upto 23rd of February. The location has been set up at Lower Parel, High Street Phoenix mall.
Story first published: Monday, February 17, 2014, 9:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X