బజాజ్ నుంచి డిస్కవర్ ఎఫ్150, జూన్‌లో విడుదల

By Ravi

దేశీయ టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో అందిస్తున్న డిస్కవర్ బ్రాండ్‌లో ఓ పవర్‌‌ఫుల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అధునాత 150సీసీ ఇంజన్‌తో కూడిన సరికొత్త 'బజాజ్ డిస్కవర్ ఎఫ్150' మోడల్ వచ్చే నెలలో విడుదల కానుంది.

ప్రస్తుతం లభిస్తున్న డిస్కవర్ కన్నా మరింత స్టయిలిష్‌గా, సెమీ-ఫెయిరింగ్‌ను కలిగిన ఈ కమ్యూటర్ సెగ్మెంట్ మోటార్‌సైకిల్ 150సీసీ, 4-వాలవ్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ ట్విన్-స్పార్క్ టెక్నాలజీతో పనిచేస్తూ 14 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేయనుంది. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.


బజాజ్ డిస్కవర్ ఎఫ్150లో ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్‌ను ఉపయోగించనున్నారు. ఇందులో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉండనుంది. డిస్కవర్ 125ఎస్‌టి కోసం ఉపయోగించిన ఛాస్సిస్‌ను ఈ కొత్త డిస్కవర్ ఎఫ్150 కోసం ఉపయోగించనున్నట్లు సమాచారం.

ఎల్ఈడి బ్రేక్ లైట్స్, ముందు వైపు స్టాండర్డ్ డిస్క్ బ్రేక్, వెనుక వైపు ఆప్షనల్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఇందులో లభ్యం కానున్నాయి. హీరో కరిజ్మా ఆర్‌కు పోటీనిచ్చేలా బజాజ్ తమ డిస్కవర్ ఎఫ్150ని డిజైన్ చేయనుంది. బాగా సక్సెస్ అయిన పల్సర్ 220 మోడల్ నుంచి స్ఫూర్తి పొంది కంపెనీ ఈ 150సీసీ బైక్‌ను డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

New Discover

కొత్త బజాజ్ డిస్కవర్ ఎఫ్150 బైక్‌ను పెర్ఫార్మెన్స్‌తో పాటు మైలేజీని కూడా దృష్టిలో ఉంచుకొని తయారు చేశారు. ఇందులో ఫెయిర్డ్ వెర్షన్‌తో పాటుగా నేక్డ్ వెర్షన్ డిస్కవర్ ఎఫ్150 కూడా విడుదలయ్యే ఆస్కారం ఉంది. ప్రస్తుతానికి ఈ బైక్‌కి సంబంధించిన మరింత సమాచారం అందుబాటులో లేదు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.
Most Read Articles

English summary
Bajaj is in the process of launching new and exciting bikes. Now there is confirmation that they will be launching a commuter bike in the Discover family in the coming month, June 2014. The bike is dubbed as Discover F150, which will be a commuter segment motorcycle and will be a semi faired vehicle by the Indian manufacturer.
Story first published: Wednesday, May 14, 2014, 17:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X