డిఎస్‌కే-బెనెల్లీ జాయింట్ వెంచర్; వచ్చే ఏడాది అన్ని బైక్స్ విడుదల

ఇటలీకి చెందిన లగ్జరీ టూవీలర్ బ్రాండ్ బెనెల్లీ (Benelli), భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ, బెనెల్లీ నేడు భారత్‌లోకి తాము అధికారికంగా ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది.

భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు గాను తాము పూనేకి చెందిన డిఎస్‌కె మోటోవీల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, డిఎస్‌కే-బెనెలీ పేరుతో ఉత్పత్తులను విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది. డిఎస్‌కే మోటోవీల్స్ ఇప్పటికే కొరియాకు చెదిన హ్యోసంగ్ మోటార్‌సైకిళ్లను భారత్‌లో అసెంబ్లింగ్ చేసి విక్రయిస్తోన్న సంగతి తెలిసినదే.

బెనెల్లీ అందిస్తున్న స్పోర్ట్స్ బైక్‌లకు గ్లోబల్ మార్కెట్లలో మంచి క్రేజ్ ఉంది. ఈ బ్రాండ్ నుంచి లభిస్తున్న స్టార్టింగ్ బైక్ ఓ 300సీసీ (బెనెల్లీ బిఎన్302 స్ట్రీట్ ఫైటర్) బైక్. డిఎస్‌కేతో తమ భాగస్వామ్యాన్ని ధృవీకరిస్తూ బెనెల్లీ నిర్వహించిన మీడియా కార్యక్రమంలో కంపెనీ కొన్ని మోటార్‌సైకిళ్లను ప్రదర్శనకు ఉంచింది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

డిఎస్‌కే ద్వారా భారత్‌కు వచ్చిన 'బెనెల్లీ'

తర్వాతి స్లైడ్‌లలో బెనెల్లీ మోటార్‌సైకిళ్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

డిఎస్‌కే ద్వారా భారత్‌కు వచ్చిన 'బెనెల్లీ'

మోటార్‌సైకిళ్లంటే స్వచ్ఛమైన ప్యాషన్ కలిగిన ఆరుగురు బెనెల్లీ బ్రదర్స్ ఈ సంస్థను స్థాపించారు. గత 1911వ సంవత్సరం నుంచి వీరు బెనెల్లీ మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేస్తున్నారు.

డిఎస్‌కే ద్వారా భారత్‌కు వచ్చిన 'బెనెల్లీ'

బెనెల్లీ గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న మొత్తం మోడళ్లను ఇండియాకు తీసుకురావాలని భావిస్తోంది. తమ భాగస్వామ్య ప్రకటన సందర్భంగా డిఎస్‌కే-బెనెల్లీ ఐదు మోడళ్లను ప్రదర్శనకు ఉంచాయి. అవి -

* టిఎన్‌టి 302

* టిఎన్‌టి 600

* టిఎన్‌టి 600 జిటి

* టిఎన్‌టి 899

* టిఎన్‌టి 1130ఆర్

డిఎస్‌కే ద్వారా భారత్‌కు వచ్చిన 'బెనెల్లీ'

డిజైన్ విషయానికి వస్తే, ఈ ఐదు మోడళ్లు విశిష్టమైన స్టయిలింగ్‌ను కలిగి ఉంటాయి. తొలిచూపులోనే లేదా మెల్లిమెల్లిగా ఈ డిజైన్లు కస్టమర్లను ఆకట్టుకుంటాయి. ఈ ఐదు మోటార్‌సైకిళ్లు కూడా దాదాపు నేక్డ్ వెర్షన్లే.

డిఎస్‌కే ద్వారా భారత్‌కు వచ్చిన 'బెనెల్లీ'

కెటిఎమ్ డ్యూక్ బైక్‌ల మాదిరిగా బయటకు కనిపించే ట్యూబ్లర్ ఫ్రేమ్ ఈ మోటార్‌సైకిళ్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

డిఎస్‌కే ద్వారా భారత్‌కు వచ్చిన 'బెనెల్లీ'

ప్రత్యేకించి బెనెల్లీ మోటార్‌సైకిళ్ల ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు ఎగ్జాస్ట్ పైప్స్ డిజైన్ చాలా విశిష్టంగా ఉంటుంది. ఈ ఫొటోలో ట్విన్ ఎగ్జాస్ట్ పైప్‌లను చూడొచ్చు.

డిఎస్‌కే ద్వారా భారత్‌కు వచ్చిన 'బెనెల్లీ'

బెనెల్లీ మోటార్‌సైకిళ్ల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే.. ఇందులో ఓ పెద్ద అనలాగ్ ఆర్‌పిఎమ్ మీటర్, టెంపరేచర్ గేజ్ మరియు ఓ డిజిటల్ మీటర్, దానిపై ఏర్పాటు చేసిన ఇండికేషన్ లైట్స్ ఉంటాయి.

డిఎస్‌కే ద్వారా భారత్‌కు వచ్చిన 'బెనెల్లీ'

బెనెల్లీ బ్రాండ్ మోటార్‌స్పోర్ట్స్ విభాగంలో కూడా మంచి పేరును కలిగి ఉంది. బెనెల్లీ బ్రదర్స్‌లో ఒకరైన టోనినో బెనెల్లీ, రేసింగ్‌లో మంచి పేరున్న వ్యక్తి. మోటోజిపి (250 క్లాస్), ఐసిల్ ఆఫ్ మ్యాన్ టిటిలో ఈ కంపెనీ అనేక ట్రోఫీలు గెలుచుకుంది.

డిఎస్‌కే ద్వారా భారత్‌కు వచ్చిన 'బెనెల్లీ'

డిఎస్‌కే మోటోవీల్స్ ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశించిన బెనెల్లీ, ఇక్కడి మార్కెట్ వినియోగదారులను ఆకట్టుకోవటం విజయం సాధిస్తుందో లేదో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందే.

Most Read Articles

Read in English: DSK Benelli Is A Thumbs Up
English summary
DSK Motowheels, the brand that brought the Korean motorcycle brand, Hyosung to India has announced their partnership with the Italian motorcycle maker, Benelli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X