చైనీస్ కీవే బ్లాక్‌స్టర్ బైక్‌ను ఇండియాకు తీసుకురానున్న డిఎస్‌కే

By Ravi

పూనేకి చెందిన డిఎస్‌కే మోటోవీల్స్ భారత్‌లో ఇప్పటికే హ్యోసంగ్, బెనెల్లీ వంటి పాపులర్ లగ్జరీ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. కాగా.. డిఎస్‌కే మరో టూవీలర్ బ్రాండ్‌ను ఇండియాకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఈసారి చైనాకి చెందిన 'కీవే' (Keeway) బ్రాండ్‌ను డిఎస్‌కే మోటోవీల్స్ ఇండియాలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

కీవే బ్రాండ్ చైనాలోని క్వింజియాంగ్ గ్రూప్‌కి చెందినది. ఇటాలియన్ బైక్ మేకర్ బెనెల్లీలో ఈ గ్రూపుకు మెజారిటీ వాటా ఉంది. ఈ నేపథ్యంలో, కీవే నుంచి మొట్టమొదటి మోటార్‌సైకిల్‌ను వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి ఇండియాలో విడుదల చేసేందుకు డిఎస్‌కే సన్నాహాలులు చేస్తోంది. డిఎస్‌కే-కీవే నుంచి రానున్న తొలి మోటార్‌సైకిల్ 'బ్లాక్‌స్టర్' (Blackster).

కీవే బ్లాక్‌స్టర్ ఓ క్రూజర్ స్టయిల్ మోటార్‌సైకిల్. ఈ మోడల్‌ను అభివృద్ధి చేసింది బెనెల్లీ ఇంజనీర్లే. డిఎస్‌కే ఈ మోటార్‌సైకిల్‌ను కూడా ఇతర బ్రాండ్ మోడళ్ల మాదిరిగానే సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూపంలో ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడి మార్కెట్లో అసెంబ్లింగ్ చేయనుంది. భవిష్యత్తులో డిఎస్‌కే మరిన్ని ద్విచక్ర వాహనాలను విడుదల చేయాలని భావిస్తోంది.

Keeway Blackster
Most Read Articles

English summary
The Blackster has been developed by Benelli engineers and quality is top notch. They would be introduced by DSK in India as a Completely Knocked Down(CKD) unit. The Keeway brand will be introduced by mid 2015 and is expected to go on sale as well then.
Story first published: Monday, December 29, 2014, 14:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X