ఇండియా బైక్ వీక్ 2015: జిక్యూ జెంటిల్‌మ్యాన్స్ రైడ్

By Ravi

గత వారం గోవాలో జరిగిన 2015 ఇండియా బైక్ వీక్ కార్యక్రమంలో జిక్యూ (GQ) మరియు ఐబిడబ్ల్యూ (IBW)లు కలిసి 'జెంటిల్‌మ్యాన్స్ రైడ్' (Gentleman's Ride) పేరిట ఓ బైక్ ర్యాలీని నిర్వహించాయి. ఈ ర్యాలీ ద్వారా బైకర్లు సేకరించిన నిధులను 'మ్యాజిక్ బస్' (Magic Bus) అనే స్వచ్ఛంద సంస్థకు అందజేయనున్నారు.

మ్యాజిక్ బస్ సంస్థ దేశంలోని ఐదు లక్షలకు పైగా అణగారిన విద్యార్థులకు అవకాశాలు కల్పించడంలో కృషి చేస్తోంది. జిక్యూ నిర్వహించిన ఈ జెంటిల్‌మ్యాన్స్ రైడ్‌లో పాల్గొన్న సభ్యులు రూ.20,000 చొప్పున మ్యాజిక్ బస్‌కు దానం చేశారు. ఈ రైడ్ కోసం ఐబిడబ్ల్యూలో స్టాల్స్ ఏర్పాటు చేసిన తయారీదారుల నుంచి సేకరించిన 8 బైక్‌లను ఉపయోగించారు.

ఇందులో ఆరు కస్టమైజ్డ్ మోటార్‌సైకిళ్లు కూడా ఉన్నాయి. ఈ రైడ్ ఐబిడబ్ల్యూ వేదిక (వగతోర్) నుండి ప్రారంభమైన గోవాలోని మోర్జిమ్ వద్ద ముగిసింది. ఆ ర్యాలీ విశేషాలు తెలుసుకుందాం రండి.

ఇండియా బైక్ వీక్ 2015: జిక్యూ జెంటిల్‌మ్యాన్స్ రైడ్

తర్వాతి స్లైడ్‌లో ఈ ర్యాలీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.

డినో మోరియా

డినో మోరియా

బాలీవుడ్ యాక్టర్, మోటార్‌సైకిల్ ప్రియుడు డినో మోరియా కూడా జిక్యూ జెంటిల్‌మ్యాన్స్ రైడ్‌లో పాల్గొన్నారు. ఇతను ఓ కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్‌ను నడిపాడు.

అర్జున్ ఖన్నా

అర్జున్ ఖన్నా

ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అర్జున్ ఖన్నా కూడా ఐబిడబ్ల్యూ 2015లో భాగం పంచుకున్నారు. ఇతను ఫ్యాషన్ పరిశ్రమలో 21 ఏళ్లుగా పనిచేస్తున్నారు. బాలీవుడు, హాలీవుడ్ స్టార్స్ కోసం ఇతను కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాడు.

ఇయాన్ కింగ్

ఇయాన్ కింగ్

డ్రాగ్ రేసింగ్ కింగ్ 'ఇయాన్ కింగ్' కూడా ఈ రైడ్‌లో పాలు పంచుకున్నారు. యూరోపియన్ టాప్ ఫ్యూయెల్ బైక్ ఛాంపియన్ బ్రిటీష్ రికార్డ్‌ను ఇతను 8 సార్లు గెలుచుకున్నాడు.

మార్టిన్ డికోస్టా

మార్టిన్ డికోస్టా

ఇండియా బైక్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సెవంటీ ఈవెంట్ మీడియా సీఈఓ మార్టిన్ డా కోస్టో కూడా ఈ రైడ్‌లో పాల్గొన్నారు. ఈ రైడ్‌లో ఇతను ఓ ఇండియన్ ఛీఫ్ క్లాసిక్ మోటార్‌సైకిల్‌ను నడిపారు.

జిక్యూ జెంటిల్‌మ్యాన్స్ రైడ్ అభ్యర్థులు

జిక్యూ జెంటిల్‌మ్యాన్స్ రైడ్ అభ్యర్థులు

ఐబిడబ్ల్యూ, జిక్యూ సంయుక్తంగా నిర్వహించిన జిక్యూ జెంటిల్‌మ్యాన్స్ రైడ్‌లో పాల్గొన్న అభ్యర్థులు.

Picture credit: India Bike Week Official Facebook Page

Most Read Articles

English summary
On the 20th and 21st of February Goa hosted the 2015 India Bike Week. This year the teamed up with GQ for a noble cause, called the Gentleman's Ride. Their sole goal for this ride was to raise funds for a particular organisation.
Story first published: Thursday, February 26, 2015, 13:48 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X