500సీసీ క్రూయిజర్ బైక్‌ను ఖరారు చేసిన హ్యార్లీ డేవిడ్‌సన్

By Ravi

అమెరికన్ ద్విచక్ర వాహన దిగ్గజం 'హ్యార్లీ డేవిడ్‌సన్', భారత మార్కెట్ కోసం ఓ 500సీసీ వెర్షన్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు గడచిన నెలలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనం ప్రచురించిన సంగతి తెలిసినదే. కంపెనీ ఇప్పుడు ఇదే విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. అంతేకాదు, ఈ 500సీసీ క్రూయిజర్ బైక్‌ను ఇండియాలోనే తయారు చేసేందుకు కూడా కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

ఈ బుజ్జి హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ను ప్రధానంగా ప్రత్యేకించి భారత్ వంటి ఆసియా దేశాలను లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చేయనున్నారు. హ్యార్లీ డేవిడ్‌సన్‌కు ఇది చిన్న బైక్ కావచ్చు, కానీ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది పెద్ద బైకే. అంతేకాకుండా, హ్యార్లీ బ్రాండ్ కావటంతో దీని ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.

తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన ఓ హ్యార్లీ డేవిడ్‍‌సన్ క్రూయిజ్ బైక్‌తో పాటుగా ఎలక్ట్రిక్ వెర్షన్ బైక్‌ను కూడా విడుదల చేసేందుకు కంపెనీ యోచిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న 2012 ఢిల్లీ అంతర్జాతీ ఆటో ఎక్స్‌పోలో హ్యార్లీ డేవిడ్‌సన్ ఈ కొత్త బైక్‌లను ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హ్యార్లీ డేవిడ్‌సన్ 883

హ్యార్లీ డేవిడ్‌సన్ 883

అమెరికన్ బైక్ కంపెనీ హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి ప్రస్తుతం లభిస్తున్న చవకైన, తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన బైక్ హ్యార్లీ డేవిడ్‌సన్ 883. కాగా.. కంపెనీ అభివృద్ధి చేస్తున్న 500సీసీ బైక్ తక్కువ బరువు, తక్కువ సీట్ ఎత్తు, మెరుగైన యాక్సిలరేషన్, బ్రేకింగ్ సామర్థ్యాలతో రూపుదిద్దుకోనుంది.

ధర

ధర

సరసమైన ధరకే ఇది విడుదలయ్యే అవకాశం ఉంది. హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి రానున్న సబ్ 500-సీసీ మోటార్‌సైకిల్ ధర రూ.4 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ల రాయల్టీని పరిగణలోకి తీసుకుంటే, ఇది అత్యంత చవకైనదనే చెప్పొచ్చు.

ఇంజన్

ఇంజన్

ఈ బైక్‌లో 500సీసీ లేదా అంతకన్నా తక్కువ సామర్థ్యం కలిగిన వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది 45 బిహెచ్‌పిల పవర్‌ను, 50ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

లోకల్ ప్రొడక్షన్

లోకల్ ప్రొడక్షన్

ఈ బైక్ ధరను తక్కువగా ఉంచేందుకు గాను, దీనిని స్థానికంగానే ఉత్పత్తి చేయనున్నారు. భారత్‌లో తయారైన ఈ చిన్న హ్యార్లీ డేవిడ్‌సన్ క్రూయిజర్ బైక్‌ను విదేశాలకు ఎగుమతి చేసే ఆస్కారం కూడా ఉంది.

Most Read Articles

English summary
This is huge. While not totally unexpected, it is a major news never the less. During the Harley Davidson 110th anniversary celebrations at Milwaukee, company COO Matthew Levatich must have left many a mouth agape when he revealed the company's plans to come out with a 500cc baby Harley Davidson.
Story first published: Thursday, September 5, 2013, 13:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X