హ్యార్లీ డేవిడ్‌సన్ లైవ్‌వైర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

By Ravi

బిగ్ న్యూస్.. ప్రముఖ అమెరికన్ కల్ట్ బైక్ మేకర్ హ్యార్లీ డేవిడ్‌సన్, మొట్టమొదటి సారిగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను తయారు చేసింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ పేరు 'హ్యార్లీ డేవిడ్‌సన్ లైవ్‌‌వైర్' (Harley-Davidson Livewire). ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ వెర్షన్ మాత్రమే. ఈ మోడల్‌పై వినియోగదారులు, నిపుణుల అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఫైనల్ ప్రొడక్షన్‌పై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

లైవ్‌వైర్ వాణిజ్య పరంగా విక్రయించడానికి తయారు చేయలేదని, వినియోగదారులకు అవగాహన కలిగించేందుకే దీనిని రూపొందించామని కంపెనీ ప్రెసిడెంట్, సీఓఓ మ్యాట్ లెవటిచ్ తెలిపారు. వచ్చే వారం నుంచి ఎంపిక చేసిన వినియోగదారులకు ఈ బైక్‌ను నడిపే అవకాశం కల్పిస్తామని, వారి నుంచి సేకరించే అభిప్రాయాల ఆధారంగా తమ తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను మరింత పటిష్టంగా రూపొందిస్తామని ఆయన వివరించారు. ఈ బైక్‌కు సంబంధించిన మరిన్ని ఫొటోలను, ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

హ్యార్లీ డేవిడ్‌సన్ ఎలక్ట్రిక్ బైక్

తర్వాతి స్లైడ్‌లలో హ్యార్లీ డేవిడ్‌సన్ లైవ్‌‌వైర్ ఎలక్ట్రిక్ మోటార్‌‌‌సైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని పరిశీలించండి.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఎలక్ట్రిక్ బైక్

'లైవ్‌‌వైర్' (Livewire) పేరును హ్యార్లీ డేవిడ్‌సన్ దాదాపు ఏడాది క్రితమే రిజిస్టర్ చేయించుకుంది, ఇప్పుడు అదే పేరును కంపెనీ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌కు కేటాయించింది.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఎలక్ట్రిక్ బైక్

హ్యార్లీ డేవిడ్‌సన్ తన స్వంత గడ్డపై (అమెరికాలో) జూన్ 19న ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. ఇది ప్రొడక్షన్ దశకు చేరుకొని, ఆ తర్వాత కస్టమర్ల వద్దకు చేరుకొనేందుకు మరికొంత సమయం పట్టే ఆస్కారం ఉంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఎలక్ట్రిక్ బైక్

అయితే, ఈ కాన్సెప్ట్‌ను చూస్తుంటే, ఇది ప్రొడక్షన్ దశకు చాలా చేరువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అనుకున్న సమయం కంటే ముందుగానే ఇది మార్కెట్లోకి వస్తే, హ్యార్లీ ప్రియులకు ఇది నిజంగానే సర్‌ప్రైజ్ అని చెప్పొచ్చు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఎలక్ట్రిక్ బైక్

క్లీన్ అండ్ స్లీక్ డిజైన్‌తో లైవ్‌వైర్‌ను క్యారక్టరైజ్ చేశారు. ఏదేమైనప్పటికీ, ఫ్యామిలీ లుక్‌ని మాత్రం అలానే కొనసాగించారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఎలక్ట్రిక్ బైక్

కార్లలో మాదిరిగా ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్, పవర్‌ఫుల్ ఎల్ఈడి హెడ్‌లైట్ వంటి ఫీచర్లతో దీనిని డిజైన్ చేశారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఎలక్ట్రిక్ బైక్

ఎల్‌సిడి డిస్‌ప్లేతో కూడిన ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ ఇందులో మరో అదనపు ఆకర్షణ.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఎలక్ట్రిక్ బైక్

లైవ్‌వైర్ ఎలక్ట్రిక్ బైక్ కూడా ఇతర హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది, ఇందులో డబుల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్ ఉంటుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఎలక్ట్రిక్ బైక్

హ్యార్లీ డేవిడ్‌సన్ లైవ్‌వైర్‌లో ట్రాన్సిమిషన్ ఉండదు, గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే ఈ బైక్ 4 సెకన్ల వ్యవధిలో గంటకు 0 నుంచి 60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఎలక్ట్రిక్ బైక్

దీని రేంజ్ 210 కిలోమీటర్లు. బ్యాటరీలను రీచార్జ్ చేయటానికి పట్టే సమయం అరగంట నుంచి గంట వరకూ మాత్రమే.

వీడియో

హ్యార్లీ డేవిడ్‌సన్ లైవ్‌వైర్ ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి.

Most Read Articles

English summary
Harley-Davidson Livewire electric motorcycle launch on June 19. Images of Harley-Davidson Livewire electric motorcycle leaked. Specifications, details of Harley-Davidson Livewire.
Story first published: Friday, June 20, 2014, 8:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X