భారత్‌లో హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్ల రీకాల్

By Ravi

అమెరికాకు లగ్జరీ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ హ్యార్లీ డేవిడ్‌సన్, భారత మార్కెట్లో విక్రయించిన కొన్ని మోటార్‌సైకిళ్లలో బ్రేక్ యూనిట్ సమస్య కారణంగా వాటిని వెనక్కు పిలిపిస్తున్నట్లు పేర్కొంది. ఇక్కడి మార్కెట్లో విక్రయించిన 2012 డైనా, సాఫ్టెయిల్ ఫ్యామిలీకి చెందిన ప్రీమియం క్రూజర్ బైక్‍‌లను కంపెనీ రీకాల్ చేస్తోంది.

ఈ మోటార్‌సైకిళ్లలోని ఫ్రంట్ బ్రేక్ మాస్టర్ సిలిండర్‌లో సమస్య కారణంగా వీటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ బ్రేక్ యూనిట్‌లో ఉపయోగించే బ్రేక్ ఆయిల్ మోటార్‌సైకిల్‌లోని ఏ ఇతర భాగంతోనైనా నేరుగా కాంటాక్ట్ అయినట్లయితే (ప్రత్యేకించి క్రోమ్ భాగాలతో) అవి తుప్పు పట్టి పాడైపోయే ప్రమాదం ఉందని కంపెనీ తెలిపింది.

ఒకవేళ ఈ యూనిట్‌లోని బ్రేక్ లైన్ థ్రెడ్స్ తుప్పు పట్టినట్లయితే, బ్రేక్ ఫ్లూయిడ్ లీక్ అయ్యి ఫ్రంట్ బ్రేక్ సరిగ్గా పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందని హ్యార్లీ డేవిడ్‌సన్ వివరించింది. గతంలో కూడా హ్యార్లీ డేవిడ్‌సన్ అమెరికాలో ఇదే సమస్యపై మొత్తం 19,015 మోటార్‌సైకిళ్లను రీకాల్ చేసింది. ఇవన్నీ కూడా ఆగస్ట్ 22, 2011 నుంచి ఫిబ్రవరి 24, 2012 కాలంలో తయారైనవి.

Harley Davidson Recall

కాగా.. భారత మార్కెట్లో ఎంత సంఖ్యలో ఈ మోటార్‌సైకిళ్లను రీకాల్ చేసిన విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. భారత్‌లోని కొన్ని రకాల హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లోను, మరికొన్ని మోటార్‌సైకిళ్లను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లోను ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయింటడం/అసెంబ్లింగ్ చేయటం చేస్తున్నారు.

భారత్‌లో హ్యార్లీ డేవిడ్‌సన్ డైనా, సాఫ్టెయిల్ మోటార్‌సైకిళ్ల యజమానులను కంపెనీ డీలర్లు సంప్రదించి, ఈ రీకాల్ గురించి వివరిస్తున్నారని కంపెనీ తెలిపింది. షోరూమ్/సర్వీస్ సెంటర్‌కు వచ్చిన ఈ వాహనాలను తనిఖీ చేసి, ఉచితంగా ఈ భాగాన్ని రీప్లేస్ చేయనున్నారు.

Most Read Articles

English summary
The American cruiser specialist Harley-Davidson has issued a recall for certain 2012 Dyna and Softail models in India over a faulty banjo bolt with thread corrosion that could cause the brakes to fail.
Story first published: Thursday, January 8, 2015, 11:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X