ఆటో ఎక్స్‌పో 2014: హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 విడుదల

By Ravi

అమెరికన్ ఆటో దిగ్గజం హ్యార్లీ డేవిడ్‌సన్ గడచిన డిసెంబర్ నెలలో గోవాలో జరిగిన ఇండియా బైక్ వీక్ 2014 ఎడిషన్‌లో ఆవిష్కరించిన తమ స్ట్రీట్ 750 మోటార్‌సైకిల్‌‌ను కంపెనీ నేడు (ఫిబ్రవరి 5, 2014)న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసింది.

దేశీయ విపణిలో ఈ బైక్ ధర రూ.4.1 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది వచ్చే నెల (మార్చ్ 2014) నుంచి వాణిజ్య పరంగా అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న 13 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఈ కొత్త మోడల్‌ను విక్రయించనున్నారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 బైక్ విషయానికి వస్తే.. ఇదొక క్రూయిజర్ స్టైల్ బైక్. టియర్ డ్రాప్ షేపులో ఉండే ఫ్యూయెల్ ట్యాంక్స్, ఎలాంగేటెడ్ బాడీ, రౌండెడ్ బికినీ ఫెయిరింగ్, వి-ట్విన్ ఇంజన్స్ వంటివి ఈ బైక్‌ ప్రత్యేకతలు. హ్యార్లీ డేవిడ్‌సన్ తెలిపిన దాని ప్రకారం, ఈ కొత్త స్ట్రీట్ సిరీస్ మోటార్‌సైకిళ్లను ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది యువకుల నుంచి అందుకున్న ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసారు.

మరి ఈ బుజ్జి హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని మరియు ఐబిడబ్ల్యూ 2014 హైలైట్స్‌ను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 విడుదల

స్ట్రీట్ 750 మోటార్‌సైకిల్‌ను పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. ఇది హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి గడచిన 13 ఏళ్ల తర్వాత లభిస్తున్న సరికొత్త బైక్‌ కావటం విశేషం.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 విడుదల

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 బైక్‌ సరికొత్త బ్లాక్ స్టయిలింగ్‌తో లభ్యం కానుంది. హ్యార్లీ దీనిని 'డార్క్ కస్టమ్' అని పిలుస్తోంది. బ్లాక్ కలర్ ఇంజన్, బ్లాక్ కవర్స్, బ్లాక్ పుల్‌బ్యాక్ హ్యాండిల్‌ బార్స్, బ్లాక్ ఫోర్క్ గైటర్స్ మరియు లోవర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 విడుదల

అంతేకాకుండా, ఈ బైక్‌లోని సైలెన్సర్ కూడా పూర్తిగా నలుపు రంగులోనే ఉంటుంది. హ్యార్లీ 70వ దశకంలో ఒరిజినల్ కెఫే రేస్ మోటార్‌సైకిళ్లలో ఈ తరహా సైలెన్సర్లను ఉపయోగించింది. ఆ తర్వాత ఇదే మొదటిసారి.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 విడుదల

హ్యార్లీ 'రెవల్యూషన్ ఎక్స్' అని పిలిచే లిక్విడ్ కూల్డ్ వి-ట్విన్ ఇంజన్‌ను ఈ బైక్‌లో ఉపయోగించారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటాయి. రెగ్యులర్ హెచ్‌డి బైక్‌ల మాదిరిగానే ఇది కూడా బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌తోనే లభ్యం కానుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 విడుదల

దూర ప్రయాణాలకు (లీజర్ బైకింగ్, టూరింగ్ బైకింగ్ మొదలైన వాటికి) అనువుగా ఉండేలా ఈ బైక్‌ను తయారు చేశారు. ఇదంతా ఒక ఎత్తయితే, కస్టమర్లు ఈ బైక్‌లను తమకు నచ్చిన విధంగా అఫీషియల్ యాక్ససరీస్‌తో కస్టమైజ్ చేసుకోవటం మరో ప్రత్యేకత.

Most Read Articles

English summary
Harley-Davidson has launched its Street 750 at a price of Rs. 4.1 lakh on the first day of the 12th Auto Expo in Greater Noida on Wednesday.
Story first published: Wednesday, February 5, 2014, 12:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X