ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2015: హెచ్‌డి స్ట్రీట్ 750

అమెరికన్ టూవీలర్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్‌సన్, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసిన హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 మోటార్‌సైకిల్‌, ప్రతిష్టాత్మక ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కైవసం చేసుకుంది. గడచిన సంవత్సరం ఈ అవార్డు రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ మోటార్‌సైకిల్ దక్కించుకుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 ఓ క్రూయిజర్ స్టైల్ మోటార్‌సైకిల్. టియర్ డ్రాప్ షేపులో ఉండే ఫ్యూయెల్ ట్యాంక్స్, ఎలాంగేటెడ్ బాడీ, రౌండెడ్ బికినీ ఫెయిరింగ్, వి-ట్విన్ ఇంజన్స్ వంటివి ఈ బైక్‌ ప్రత్యేకతలు. హ్యార్లీ డేవిడ్‌సన్ తెలిపిన దాని ప్రకారం, ఈ కొత్త స్ట్రీట్ సిరీస్ మోటార్‌సైకిళ్లను ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది యువకుల నుంచి అందుకున్న ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసారు.

Harley Davidson Street 750

స్ట్రీట్ 750 మోటార్‌సైకిల్‌ను పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. ఇది హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి గడచిన 13 ఏళ్ల తర్వాత లభిస్తున్న సరికొత్త బైక్‌ కావటం విశేషం. హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 బైక్‌ సరికొత్త బ్లాక్ స్టయిలింగ్‌తో లభ్యం కానుంది. హ్యార్లీ దీనిని 'డార్క్ కస్టమ్' అని పిలుస్తోంది. బ్లాక్ కలర్ ఇంజన్, బ్లాక్ కవర్స్, బ్లాక్ పుల్‌బ్యాక్ హ్యాండిల్‌ బార్స్, బ్లాక్ ఫోర్క్ గైటర్స్ మరియు లోవర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

అంతేకాకుండా, ఈ బైక్‌లోని సైలెన్సర్ కూడా పూర్తిగా నలుపు రంగులోనే ఉంటుంది. హ్యార్లీ 70వ దశకంలో ఒరిజినల్ కెఫే రేస్ మోటార్‌సైకిళ్లలో ఈ తరహా సైలెన్సర్లను ఉపయోగించింది. ఆ తర్వాత ఇదే మొదటిసారి. హ్యార్లీ 'రెవల్యూషన్ ఎక్స్' అని పిలిచే లిక్విడ్ కూల్డ్ వి-ట్విన్ ఇంజన్‌ను ఈ బైక్‌లో ఉపయోగించారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటాయి. రెగ్యులర్ హెచ్‌డి బైక్‌ల మాదిరిగానే ఇది కూడా బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌తోనే లభ్యం కానుంది.

Most Read Articles

English summary
Kick starting the Auto Awards season this year, the 10th Indian Car of the Year (ICOTY) and the 8th Indian Motorcycle of the Year (IMOTY) Awards were announced in Mumbai. Harley Davidson Street 750 won the awardor Indian Motorcycle of the year 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X