హీరో ఏవియర్ ఎలక్ట్రిక్ సైకిళ్లు విడుదల

By Ravi

ఇండియన్ టూ-వీలర్ మేకర్ హీరో ఎలక్ట్రిక్ తమ ఏవియర్ రేంజ్‌లో రెండు ఈ-సైకిళ్లను (ఎలక్ట్రిక్ సైకిళ్లను) బుధవారం నాడు మార్కెట్లో విడుదల చేసింది. మెట్రో నగరాల్లోని యువ కార్పొరేట్ ప్రొఫెషనల్స్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లను రూపొందించామని కంపెనీ పేర్కొంది.

స్త్రీ, పురుషుల కోసం రూపొందించిన ఏవియర్ సైకిళ్ల ధరలను రూ.18,990, రూ.19,290గా (ఆన్ రోడ్ ధర, న్యూఢిల్లీ)గా నిర్ణయించామని హీరో గ్రూప్ మేనేజిండ్ డెరైక్టర్ నవీన్ ముంజాల్ తెలిపారు. ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణే, చెన్నై నగరాల్లో లభ్యం కానున్నాయి.

Hero Electric Launches Avior

తమ ఇళ్లకు సమీపంలో ఉన్న ఆఫీసలకు ప్రకృతి సాన్నిహిత్య మార్గంలో చేరుకోవాలనే యువ కార్పోరేట్ ప్రొఫెషనల్స్‌ను ఉద్దేశించి వీటిని తయారు చేసినట్లు ముంజాల్ తెలిపారు. లిధియమ్ బ్యా టరీలతో నడిచే ఈ ఏవియర్ ఈ-సైకిళ్లలో ఆరు గేర్లు ఉంటాయని, వీటిని 5 నుంచి 6 గంటల పాటు చార్జింగ్ చేస్తే సరిపోతుందని ఆయన వివరించారు.

హీరో ఏవియర్ ఎలక్ట్రిక్ సైకిళ్లు గంటకు 25 కిమీ గరిష్ట వేగంతో ప్రయాణించగలవు. ఈ సైకిళ్లను ఆన్‌లైన్‌లో కూడా విక్రయించనున్నామని ముంజాల్ తెలిపారు. ఢిల్లీతో పోల్చుకుంటే, ఇతర నగరాల్లో ఈ సైకిళ్ల ధరలు అధికంగా ఉంటాయని, ఢిల్లీ ప్రభుత్వం వీటిపై 15 శాతం సబ్సిడీ ఇవ్వడమే కాకుండా ఎలాంటి వ్యాట్‌ను విధించడం లేదని, అందుకే అక్కడ ధరలు తక్కువగా ఆయవ వివరించారు.

Most Read Articles

English summary
Two-wheeler maker Hero Electric today launched two models of e-cycles under Avior range, priced at between Rs 18,990 and Rs 19,290 (ex-showroom Delhi). The e-cycles that aim to tap corporate professionals in metro cities will also be available in Bangalore, Mumbai, Pune, Hyderabad, Bangalore and Chennai.
Story first published: Thursday, October 30, 2014, 9:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X