హీరో హస్టర్ 620సీసీ బైక్ అఫీషియల్ వీడియో

By Ravi

దేశీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ ఇటీవలే ముగిసిన 2014 ఆటో ఎక్స్‌లో కంపెనీ ఆవిష్కరించిన తమ సరికొత్త 620సీసీ మోడ్రన్ స్పోర్ట్స్ బైక్ 'హీరో హస్టర్' (Hero Hastur)కు సంబంధించిన అఫీషియల్ వీడియోని విడుదల చేసింది. ఇందులో తమ హస్టర్ బైక్ విశిష్టలను హీరో మోటోకార్ప్ వివరించింది. ఆ విశేషాలను మనం కూడా వీక్షిద్దాం రండి.

షార్ప్ డిజైన్‌, స్పోర్టీ యల్లో కలర్ ఫ్రేమ్ కలిగి ఉండే ఈ హీరో హస్టర్ బైక్‌లో 620సీసీ వాటర్-కూల్డ్ పారలల్ ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 9600 ఆర్‌పిఎమ్ వద్ద 80 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని మొత్తం బరువు 159.7 కేజీలు. ఇది కేవలం 3.8 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుటుంది. దీని గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు.

ప్రస్తుతం కాన్సెప్ట్ దశలో ఉన్న హీరో హస్టర్ బైక్ త్వరలోనే ఉత్పత్తి దశకు చేరుకోనుంది. హీరో మోటోకార్ప్ తమ హస్టర్ స్పోర్ట్స్ బైక్ కాన్సెప్ట్‌ను ప్రత్యేకించి అంతర్జాతీయ మార్కెట్ల కోసం తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇది ఇండియాలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి. ఈ లోపుగా ఈ వీడియోని వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/92ePFEUmMR4" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Hero Motocorp have now released an official video of the its 620cc premium bike Hero Hastur. The Hastur is powered by a liquid cooled 620cc parallel twin with a patented CSI cylinder head churning out 80 ps 9600 rpm.&#13;
Story first published: Friday, February 14, 2014, 14:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X