హీరో ఐయాన్, హస్టర్, స్ప్లెండర్ ప్రో క్లాసిక్, సింప్లిసిటీ ఈ-బైక్

దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఆటో ఎక్స్‌పో 2014కు ముందుగానే డీజిల్‌తో నడిచే ఆర్ఎన్‌టి కాన్సెప్ట్ మోటార్‌సైకిల్‌ను మరియు హెచ్ఎక్స్250ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను ఆవిష్కరించి, బైక్ ప్రియులను అబ్బురపరచిన కంపెనీ, తాజాగా మరిన్ని అద్భుతమైన ఉత్పత్తులను ఈ 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది.

ఇందులో ఐదు కాన్సెప్ట్ వాహనాలు ప్రధానంగా అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. అవి - హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్, ప్యాషన్ ప్రో టిఆర్, హస్టర్ 620సీసీ స్పోర్ట్స్ బైక్, ఐయాన్ హైడ్రోజన్ బైక్ కాన్సెప్ట్ మరియు సింప్లిసిటీ స్ట్రీట్ బైక్ కాన్సెప్ట్. ఈ ఐదు మోడళ్లకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

స్ప్లెండర్ ప్రో క్లాసిక్

స్ప్లెండర్ ప్రో క్లాసిక్

కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిల్‌ను తలపించేలా (రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి మాదిరిగా) హీరో మోటోకార్ప్ తమ 100సీసీ బైక్ స్ప్లెండర్ ప్రోను తీర్చిదిద్దింది. ఈ కాన్సెప్ట్‌కు 'స్ప్లెండర్ ప్రో క్లాసిక్' అనే పేరును పెట్టారు. రౌండ్ హెడ్‌ల్యాంప్, స్టీల్ మడ్‌గార్డ్, కెఫే రేసర్ స్టైల్ సీట్ కౌల్‌తో ఇది క్లాసిక్ లుక్‌ని కలిగి ఉంటుంది.

కెఫే రేసర్ స్టైల్

కెఫే రేసర్ స్టైల్

ఈ స్ప్లెండర్ ప్రో క్లాసిక్‌లో కెఫే రేసర్ స్టైల్ బాడీ కలర్, రౌండ్ స్టీల్ రియర్ వ్యూ మిర్రర్స్, రౌండ్ టర్న్ ఇండికేటర్స్‌తో ఇది క్లాసిక్ కెఫే రేసర్ బైక్‌ను తలపిస్తుంది. ఇందులో ఉపయోగించిన ఇంజన్, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్ప్లెండర్ సిరీస్ బైక్‌లలో ఉపయోగిస్తున్న 100సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజనే. అయితే, దీని పవర్ వివరాలు మాత్రం తెలియరాలేదు.

ప్యాషన్ ప్రో టిఆర్

ప్యాషన్ ప్రో టిఆర్

హీరో మోటోకార్ప్ అందిస్తున్న మరో 100సీసీ బైక్ ప్యాషన్ ప్రోను ఆధారంగా చేసుకొని కంపెనీ ఓ కొత్త కాన్సెప్ట్‌ను తయారు చేసింది. దీని పేరు ప్యాషన్ ప్రో టిఆర్. ఆఫ్ రోడర్ బైక్‌ను తలపించేలా ప్యాషన్ ప్రో టిఆర్‌ను మోడిఫై చేశారు. థ్రెడ్ వీల్స్, రైజ్డ్ ఫ్రంట్ ఫెండర్స్, హెడ్‌ల్యాంప్ గ్రిల్, ఇంజన్ గార్డ్, ఫ్యూయెల్ ట్యాంక్ ప్యాడ్స్, హ్యాండ్ గార్డ్‌ను ఇందులో గమనించవచ్చు.

హీరో హస్టర్

హీరో హస్టర్

హీరో హస్టర్ ఓ స్ట్రీట్ నేక్డ్ స్టయిలింగ్ బైక్. కేటిఎమ్ డ్యూక్ మోడళ్లను తలిపించేలా దీని డిజైన్ ఉంటుంది. ఇందులో పవర్‌ఫుల్ 620సీసీ, పారలల్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 79 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

హీరో సింప్లిసిటీ

హీరో సింప్లిసిటీ

ఫ్యూచర్ అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను దృష్టిలో ఉంచుకొని, హీరో మోటోకార్ప్ ఈ సింప్లిసిటీ (లేదా సింపుల్ఈసిటీ) అనే ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ టూవీలర్‌ను ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ బైస్కిల్ సుమారు 35 కేజీల బరువును కలిగి ఉంటుంది. ఇందులో విశిష్టమైన ఫీచర్ ఒకటి ఉంది, అదే వాక్ మోడ్. ఈ మోడ్ ఆన్ చేసినప్పుడు మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ బైస్కిల్‌ను మనం నెట్టుకుంటా వెళ్లాల్సిన అవసరం లేకుండా, దానంతట అదే నెమ్మదిగా ముందుకు వెళ్తుంటుంది.

హీరో ఐయాన్

హీరో ఐయాన్

ఫ్యూచరిస్టిక్ లుక్‌ని కలిగి ఉండే ఈ కాన్సెప్ట్ బైక్ పేరు 'హీరో ఐయాన్'. ఎవ్వరూ ఊహించని రీతిలో హీరో మోటోకార్ప్ ప్రవేశపెట్టిన ఈ ఐయాన్ కాన్సెప్ట్ 2014 ఆటో ఎక్స్‌పో హైలైట్‌గా నిలిచింది. ఇది హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ (నీటి)తో నడిచే బైక్.

హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్

హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్

హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ (నీటి)తో నడిచే హీరో ఐయాన్ కాన్సెప్ట్ బైక్‌లో స్పోక్‌లు లేని చక్రాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ చక్రాలలో ఉండే మోటార్లు అయస్కాంత శక్తి ద్వారా పనిచేసి, టైర్లను తిప్పేందుకు సహకరిస్తాయి.

టెక్నాలజీ

టెక్నాలజీ

హీరో ఐయాన్ స్టీరింగ్ సిస్టమ్ (హ్యాండిల్) కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ బైక్‌లో ఉపయోగించిన సస్పెన్షన్ సిస్టమ్‌ను మాగ్నెటో కెలాజికల్ అడాప్టివ్ డాంపింగ్ సిస్టమ్ అంటారు. ఇందులోని సెన్సార్లు రోడ్డు పరిస్తితులను గుర్తించి, వాటికి అనుగుణంగా స్పందిస్తాయి. ఈ ఫ్యూచరిస్టిక్ బైక్ ప్రస్తుతానికి కాన్సెప్ట్ మాత్రమే.

Most Read Articles

English summary
Hero MotoCorp has revealed five new concpts at 2014 Deldhi Auto Expo which included two 100cc mileage bikes with a twist and three concept models - The Splendor Pro Classic, the Passion Pro TR, the Hastur 620cc sports bike, the iON hydrogen concept & the SimplEcity street bike concept.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X