హీరో మ్యాస్ట్రో ఇప్పుడు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్‌తో..

By Ravi

దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్, పురుషుల కోసం విక్రయిస్తున్న హీరో మ్యాస్ట్రో స్కూటర్ ఇప్పుడు డ్యూయెల్ టోన్ ఆప్షన్‌తో లభ్యం కానుంది. ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, అమ్మకాలను పెంచుకునేందుకు హీరో మోటోకార్ప్ తమ మ్యాస్ట్రో స్కూటర్ డ్యూయెల్ టోన్ పెయింట్ జాబ్‌తో పాటుగా ఆకర్షనీయమైన గ్రాఫిక్స్‌తో డిజైన్ చేసిన కొత్త వేరియంట్‌‌ను విడుదల చేసింది.

కొత్త హీరో మ్యాస్ట్రో వైట్ అండ్ రెడ్ (గ్రూవీ మెడ్లీ) కలర్ థీమ్‌తో లభిస్తుంది. స్కూటర్ ప్యానెల్స్‌పై క్రోమ్ మ్యాస్ట్రో బ్యాడ్జ్ క్రింది భాగంలో కొత్త గ్రాఫిక్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఈ గ్రాఫిక్స్ కేవలం వైట్ అండ్ రెడ్ (గ్రూవీ మెడ్లీ) వేరియంట్‌లో మాత్రమే కాకుండా, ఇతర అన్ని కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.


హీరో మ్యాస్ట్రో స్కూటర్ గ్రూవీ మెడ్లీ (కొత్త కలర్ ఆప్షన్), ప్యాంథర్ బ్లాక్, మాగ్నటిక్ మ్యాట్ గ్రే, ఫోర్స్ సిల్వర్, వైటల్ వైట్, బ్లేజింగ్ రెడ్, ఎలక్ట్రిక్ బ్లూ అనే రంగులలో లభిస్తుంది. ఈ 110సీసీ స్కూటర్‌లో యాంత్రిక పరంగా ఎలాంటి మార్పులు లేవు.

హీరో మ్యాస్ట్రో స్కూటర్‌లో 109సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8 బిహెచ్‌పిల శక్తిని, 5550 ఆర్‌పిఎమ్ వద్ద 9.10 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Hero Maestro

కాంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, 18 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, అనలాగ్ అండ్ డిజిటల్ కాంబినేషన్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, పంక్చర్లను తట్టుకునే 90/100 x 10 - 53 J టైర్స్ వంటి ఫీచర్లు దీని సొంతం.

హీరో మ్యాస్ట్రో 1780 మి.మీ. పొడవును, 710 మి.మీ. వెడల్పును, 1165 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని సీట్ హైట్ 770 మి.మీ., వీల్‌‌బేస్ 1240 మి.మీ. మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 155 మి.మీ. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు, మొత్తం బరువు 110 కేజీలు.

Most Read Articles

English summary
Country's largest two wheeler manufacturer Hero motocorp has given its 110cc scooter, Hero Maestro, a mild make over by introducing a fresh range of colour schemes with new body graphics. 
Story first published: Friday, October 10, 2014, 12:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X