స్కూటర్ ఎగుమతుల్లో హోండా‌ని ఓవర్‌‌టేక్ చేసిన హీరో

By Ravi

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో స్కూటర్ విభాగంలో హీరో మరియు హోండా బ్రాండ్‌ల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొని ఉంది. యాక్టివా, డియో వంటి పాపులర్ స్కూటర్లతో ఈ సెగ్మెంట్లో అగ్రగామిగా ఉన్న హోండాను తొలిసారిగా హీరో ఓవర్‌టేక్ చేసింది.

ఎగుమతుల పరంగా చూసుకుంటే.. హీరో మోటోకార్ప్ గడచిన సంవత్సరంలో మొత్తం 84,690 స్కూటర్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇదే సమయంలో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 79,184 స్కూటర్లను మాత్రమే ఎగుమతి చేసింది.

ప్రస్తుతం హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో 100సీసీ ప్లెజర్, 110సీసీ మ్యాస్ట్రో స్కూటర్లను మాత్రమే విక్రయిస్తోంది. కాగా.. ఈ ఏడాదిలో తమ సరికొత్త 110సీసీ స్కూటర్ హీరో డ్యాష్ మరియు మరో కొత్త 125సీసీ స్కూటర్ హీరో డేర్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేయాలని చూస్తోంది.

Hero Scooter Sales

కాగా.. హోండా మోటార్‌సైకిల్ ఇండియా స్కూటర్ ఇండియా లిమిటెడ్ దేశీయ స్కూటర్ మార్కెట్లో 110సీసీ యాక్టివా, 110సీసీ ఏవియేటర్, 110సీసీ డియో, 125సీసీ యాక్టివా మోడళ్లను విక్రయిస్తోంది.

స్కూటర్ ఎగుమతుల పరంగా హోండాను, హీరో మోటోకార్ప్ ఓవర్‌టేక్ చేసినప్పటికీ, భారత స్కూటర్ మార్కెట్లో హోండాదే అగ్రస్థానం. ప్రస్తుతం భారత స్కూటర్ మార్కెట్లో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్‌కు 55 శాతం మార్కెట్ వాటా ఉంటే, హీరో మోటోకార్ప్‌కు కేవలం 16.5 శాతం మాత్రమే మార్కెట్ వాటా ఉంది.

Most Read Articles

English summary
Hero MotoCorp has beat Honda two-wheelers India to become the country's largest motor scooter exporter. Hero MotoCorp and Honda Motorcycle and Scooter split four years ago and went in their own path, competing with each other in sales.
Story first published: Tuesday, January 20, 2015, 13:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X