2015 మధ్యలో రానున్న హీరో హెచ్ఎక్స్250ఆర్ బైక్!

By Ravi

స్పోర్ట్స్ బైక్ ప్రియులంతా హీరో మోటోకార్ప్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 250సీసీ స్పోర్ట్స్ బైక్ 'హీరో హెచ్‌ఎక్స్‌250ఆర్' (Hero HX250R) ఈ ఏడాది మధ్య భాగం నాటికి మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

బజాజ్ ఆటో తమ కొత్త పల్సర్ ఆర్200 బైక్‌ని మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లో విడుదల చేయనున్న నేపథ్యంలో, హీరో మోటోకార్ప్ కూడా తమ హెచ్ఎక్స్250ఆర్ బైక్ విడుదల వేగవంతం చేస్తున్నట్లు సమాచారం.

భారత మార్కెట్‌తో పాటుగా పలు అంతర్జాతీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని, హీరో మోటోకార్ప్ తమ అమెరికన్ భాగస్వామి ఎరిక్ బ్యూయెల్ రేసింగ్‌తో కలిసి ఈ హెచ్ఎక్స్250ఆర్ మోడల్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్ చేశారు.

Hero MotoCorp HX250R

ఈ బైక్‌లో ఉపయోగించిన 250సీసీ ఇంజన్ గరిష్టంగా 31 పిఎస్‌‌ల శక్తిని, 26 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది కేవలం 2.7 సెకండ్ల వ్యవధిలోనే 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

అండర్ సీట్ ఎగ్జాస్ట్ (సీటు క్రింద ఉండే సైలెన్సర్) ఇందులో ప్రధాన ప్రత్యేకత. ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఇగ్నిషన్ సిస్టమ్, కాంబినేషన్ ఆఫ్ ఏబిఎస్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఈ బైక్ బరువు కేవలం 139 కిలోలు మాత్రమే. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Indian two-wheeler giant Hero MotoCorp has planned to launch several motorcycles and scooter in India during 2015. Their highly anticipated HX250R is expected to launch by mid-2015.
Story first published: Friday, March 20, 2015, 10:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X