ఆటో ఎక్స్‌‌పోలో హీరో మోటోకార్ప్ నుంచి 12 కొత్త మోడళ్లు

By Ravi

భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వచ్చే నెలలో జరగనున్న 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో దాదాపు డజనుకు పైగా కొత్త మోడళ్లను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో కాన్సెప్ట్ వాహనాలు, హైబ్రిడ్ వాహనాలు కూడా ఉండనున్నాయి.

తమ స్వంత టెక్నాలజీతో మొట్టమొదటిసారిగా ఆటో ఎక్స్‌పో పాల్గొంటున్నామని, అంతేకాకుండా జపనీస్ భాగస్వామి హోండా నుంచి విడిపోయిన తర్వాత వ్యక్తిగతంగా పాల్గొంటున్న ఆటో ఎక్స్‌పో కూడా ఇదేనని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పవన్ ముంజాల్ వెల్లడించారు.

ఈ ఆటో ఎక్స్‌పోలో తాము విడుదల చేయనున్న ఉత్పత్తుల ద్వారా తామేంటో, తమ సత్తా ఎంటో చాటిచెబుతామని ఆయన అన్నారు. ఇందులో కొన్ని త్వరలో వాణిజ్య దశకు చేరుకోనున్న కొన్ని కాన్సెప్ట్ వాహనాలను మరియు పూర్తిశ్రేణి బైక్‌లు, స్కూటర్లను ప్రదర్శిస్తామని ఆయన తెలిపారు.

Hero Leap

ఈ ఉత్పత్తులన్నింటినీ తమ స్వంత టెక్నాలజీతో అలాగే తమ భాగస్వామ్యుల సహకారంతో తయారు చేశామని ముంజాల్ చెప్పారు. ఆటో ఎక్స్‌పో 2014లో కొత్త ఉత్పత్తుల ప్రదర్శనతో పాటుగా, కంపెనీ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రణాళికలు, ప్రగతి మరియు ఇతర సాంకేతికతల గురించి వివరించనున్నారు.

12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పో గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు జరగనునుంది. ఫిబ్రవరి 5-6 తేదీలలో కేవలం ప్రెస్ కోసం మాత్రమే ఓపెన్ చేయబడి ఉండగా, ఫిబ్రవరి 7-11వ తేదీల వరకు జనరల్ పబ్లిక్ కోసం ఓపెన్ చేసి ఉంచనున్నారు.

గడచిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హీరో మోటోకార్ప్ ఆవిష్కరించిన లీప్ హైబ్రిడ్ స్కూటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలించిది. ఈసారి హీరో మోటోకార్ప్ ఎలాంటి కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుందో అనే అంశంపైనే అందరి దృష్టి నెలకొని ఉంది.

Most Read Articles

English summary
The country's largest two-wheeler maker Hero MotoCorp is set to showcase its future road map at the upcoming Auto Expo with over a dozen models, including concepts and hybrids, set for display.
Story first published: Monday, January 20, 2014, 12:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X