త్వరలో 2014 కరిజ్మా ఆర్, జెడ్ఎమ్ఆర్, ఎక్స్‌ట్రీమ్ విడుదల

By Ravi

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలో ఆవిష్కరించిన 15 కొత్త ఉత్పత్తులలో ఇప్పటికే హెచ్ఎఫ్ డీలక్స్ ఈకో, స్ప్లెండర్ ఐస్మార్ట్ మరియు అప్‌డేటెడ్ ప్లెజర్ స్కూటర్లను మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల చేసిన కంపెనీ తాజాగా మరో మూడు అప్‌డేటెడ్ మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇది కూడా చదవండి: హీరో మోటోకార్ప్ నుంచి ఆరు నెలల్లో 15 కొత్త ఉత్పత్తులు

సరికొత్త కరిజ్మా ఆర్, కరిజ్మా జెడ్‌ఎమ్ఆర్ మరియు ఎక్స్‌ట్రీమ్ మోడళ్లను త్వరలోనే విడుదల చేసేందుకు హీరో మోటోకార్ప్ సన్నాహాలు చేస్తోంది. ఈ మూడు మోడళ్లను కంపెనీ మనుపటి వెర్షన్‌ల కన్నా మరింత మెరుగ్గా, స్టయిలిష్‌గా ఉండేలా తీర్చిదిద్దారు.

మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

2014 కరిజ్మా ఆర్

2014 కరిజ్మా ఆర్

హీరో మోటోకార్ప్ అందిస్తున్న కరిజ్మా ఆర్ (బాడీ ప్యానెల్స్ లేని నేక్డ్ వెర్షన్)లో కూడా కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. అంతర్జాతీయ సాంకేతిక భాగస్వాముల సహకారంతో కంపెనీ ఈ బైక్ డిజైన్‌, ఇంజన్, ఫీచర్లను అభివృద్ధి చేసింది. ఇందులో కొత్త 223సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు.

2014 కరిజ్మా జెడ్ఎమ్ఆర్

2014 కరిజ్మా జెడ్ఎమ్ఆర్

అదే విధంగా హీరో మోటోకార్ప్ అందిస్తున్న కరిజ్మా జెడ్ఎమ్ఆర్ (బాడీ ప్యానెల్స్ కలిగిన ఫుల్లీ ఫెయిర్డ్ వెర్షన్)లో కూడా కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. దీనిని డిజైన్‌, ఇంజన్, ఫీచర్లను కూడా అంతర్జాతీయ సాంకేతిక భాగస్వాముల సహకారంతో కంపెనీ అభివృద్ధి చేసింది. ఇందులో కూడా కొత్త 223సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు.

2014 సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్

2014 సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్

హీరో నుంచి రానున్న ఈ అప్‌గ్రేడెడ్ 150సీసీ ప్రీమియం మోటార్‌సైకిల్‌లో ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్ ఫీచర్‌ను జోడించనున్నారు. అలాగే, దీని డిజైన్‌లో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇంజన్ ఇమ్మొబిలైజర్ అనేది కార్లలో ఉండే ఓ సెక్యూరిటీ ఫీచర్. ఇమ్మొబిలైజర్ అంటే ఆ వాహనానికి సంబంధించిన సరైన తాళం చెవిని వాడితేనే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. వేరే తాళంతో ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే, అలారం మ్రోగి ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఇంజన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవు.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఈకో

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఈకో

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఈకో మోటార్‌సైకిల్‌లో 97.2సీసీ, ఫోర్-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్, ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7.7 బిహెచ్‌పిల శక్తిని, 8.04 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.50,500 లుగా ఉంది.

మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్

హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్

హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన 'ఐ3ఎస్ టెక్నాలజీ' (i3S Technology)తో లభిస్తుంది. ఈ టెక్నాలజీ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఇదొక 'ఐడిల్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్'.

మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

2014 హీరో ప్లెజర్ స్కూటర్

2014 హీరో ప్లెజర్ స్కూటర్

హీరో మోటోకార్ప్ అందిస్తున్న ప్లెజర్ స్కూటర్‌లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త 2014 హీరో ప్లెజర్ స్కూటర్ ధర రూ.49,126 (ఎక్స్-షోరూమ్, ముంబై)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Most Read Articles

English summary
India's largest two-wheeler manufaturer Her MotoCorp, after succefully lanching the HF Delux Eco, Splendor i-Smart and updated Pleasure scooter, now getting ready to introduce 2014 versions of the Karizma R, Karizma ZMR and the Extreme.
Story first published: Wednesday, April 9, 2014, 10:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X