2015లో అమెరికా మార్కెట్లోకి ప్రవేశించనున్న హీరో మోటోకార్ప్

By Ravi

భారతదేశపు అదిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్, అమెరికా మార్కెట్లో ప్రవేశించేందుకు ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. స్వదేశంలో అత్యంత పాపులర్ అయిన హీరో ద్విచక్ర వాహనాలను వచ్చే ఏడాది అమెరికా మార్కెట్లో కూడా లభ్యం కానున్నాయి. యూఎస్‌ మార్కట్లో భారీ వాటాను చేజిక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో కంపెనీ పావులు కదుపుతోంది.

హీరో మోటోకార్ప్ ఇప్పటికే అమెరికాకు చెందిన ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ (ఈబిఆర్) టూవీలర్ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, అమెరికన్ మార్కెట్లో హీరో ఉత్పత్తులను ఈబిఆర్ నెట్‌వర్క్ ద్వారా మార్కెటింగ్ చేయనున్నారు. యూఎస్ మార్కెట్లో హీరో మోటోకార్ప్‌ మంచి ఆదరణ లభించగలదని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Hero MotoCorp

కాగా.. పాశ్యాత్య మార్కెట్‌ కోసం ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లపై దృష్టి పెట్టకుండా ప్రస్తుతం తాము అందిస్తున్న ఉత్పత్తులనే ఆ మార్కెట్లోను కొనసాగించాలనుకుంటున్నుట్లు హీరో మోటోకార్ప్ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పవన్‌ ముంజాల్ తెలిపారు. 2015 కేలండర్‌ ఇయర్‌లో యూఎస్ మార్కెట్లో ప్రవేశిస్తామని ఆయన వివరించారు.

హీరోమోటో కార్ప్‌లో ఈబీఆర్‌కు 49.2 శాతం వాటా ఉంది. యూఎస్‌లో ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్ల నియామకం కూడా జరుగుతోందని, ఈ మార్కెట్లో భారీ వాటాను దక్కించోగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యూస్ మార్కెట్లో మార్కెట్లో హై వపర్‌ బైక్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి బడ్జెట్ మోటార్‌సైకిళ్లకు ప్రధాన్యమిచ్చే చిన్న పట్టణాలపై దృష్టి పెట్టనున్నట్లు ముంజాల్ తెలిపారు. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ 100 సీసీ నుంచి 250 సీసీ రేంజ్‌‌లో ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది.

Most Read Articles

English summary
Hero MotoCorp is gearing up to go global in a big way starting next year, first with the launch of its commuter bikes in the U.S, followed by entry into the Brazilian market in 2016.
Story first published: Monday, June 16, 2014, 9:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X