హోండా యాక్టివా 125 బుకింగ్స్ ప్రారంభం

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా, గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో సరికొత్త 125సీసీ వెర్షన్ యాక్టివా స్కూటర్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. మరికొద్ది రోజుల్లోనే ఈ కొత్త హోండా యాక్టివా 125 మార్కెట్‌లో వాణిజ్య పరంగా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో, కొందరు హోండా మోటార్‌సైకిల్ డీలర్లు యాక్టివా 125 కోసం బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు. కేవలం రూ.5,000 అడ్వాన్స్ మొత్తాన్ని స్వీకరించి, బుకింగ్‌లను అంగీకరిస్తున్నారు. ఈ నెలాఖరులోపే కొత్త హోండా యాక్టివ్ 125 విడుదల కానుంది. ఈ పవర్‌ఫుల్ స్కూటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హోండా యాక్టివా 125

పవర్‌ఫుల్ ఇంజన్‌తో కూడిన పెర్ఫామెన్స్ వెర్షన్ యాక్టివాను కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ 125సీసీ వెర్షన్ యాక్టివాను తయారు చేసింది. ఇది ఏవియేటర్ మాదిరిగానే రెండు వేరియంట్లలో (స్టాండర్డ్, డీలక్స్) లభ్యం కానుంది.

హోండా యాక్టివా 125

స్టాండర్డ్ వేరియంట్ యాక్టివా 125 అల్లాయ్ వీల్స్, డ్రమ్ బ్రేక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. అలాగే, డీలక్స్ వేరియంట్ హోండా యాక్టివా 125 అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

హోండా యాక్టివా 125

డీలక్స్ వేరియంట్లో 190 మి.మీ. డ్రమ్ బ్రేక్‌ను (ముందు వైపు మాత్రమే), స్టాండర్డ్ వేరియంట్లో 130 మి.మీ. డ్రమ్ బ్రేక్స్ (ఇరు వైపులా)ను ఉపయోగించారు. ఇవి రెండు వేరియంట్లు కూడా హోండా యొక్క కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (సిబిఎస్)తో లభిస్తాయి.

హోండా యాక్టివా 125

హోండా యాక్టివా 125లో పవర్‌ఫుల్ 124సీసీ, ఫోర్-స్ట్రోక్, ఫోర్స్ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ 125సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6500 ఆర్‌పిఎమ్ వద్ద 8.6 హెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.12 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ రెగ్యులర్ వి-మ్యాటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

హోండా యాక్టివా 125

హోండా యాక్టివా 125 స్కూటర్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, పెరల్ వైట్, మెటాలిక్ సిల్వర్ అనే రంగుల్లో లభిస్తుంది. తర్వాతి స్లైడ్‌లలో కలర్ ఆప్షన్లను చూడండి.

హోండా యాక్టివా 125

యాక్టివా 125లో ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. దీని ఫలితంగా ముందు వైపు చక్రం 12 ఇంచ్‌లు మరియు వెనుక వైపు చక్రం 10 ఇంచ్‌ల పరిమాణానాన్ని కలిగి ఉంటుంది.

హోండా యాక్టివా 125

హోండా యాక్టివా 125 ధరలు ఇలా ఉన్నాయి:

స్టాండర్డ్ - రూ.56,000

డీలక్స్ - రూ.61,000

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

హోండా యాక్టివా 125

హోండా ఇప్పటికే యాక్టివా సిరీస్‌లో తక్కువ ధర కలిగిన 'యాక్టివా ఐ' స్కూటర్‌ను రెగ్యులర్ 110సీసీ యాక్టివాకు దిగువన ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. కాగా.. ఈ కొత్త యాక్టివా 125ను రెగ్యులర్ 110సీసీ యాక్టివాకు ఎగువన ప్రవేశపెట్టనున్నారు.

Most Read Articles

English summary
There is exciting news for all those who have been waiting for the Honda Activa 125 to launch ever since its reveal at the Auto Expo 2014 in February. Honda Two Wheeler has now officially commenced bookings for the new 125cc scooter for the amount of Rs 5,000.
Story first published: Friday, April 4, 2014, 16:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X