హోండా యాక్టివా 125సీసీ స్కూటర్ ధరలు వెల్లడి!

By Ravi

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా అందిస్తున్న యాక్టివా సిరీస్ స్కూటర్లలో మరో కొత్త వేరియంట్ వచ్చి చేరింది. ఇప్పటికే 110సీసీ యాక్టివా మరియు 110సీసీ యాక్టివా ఐ స్కూటర్లను విక్రయిస్తున్న హోండా ఇప్పుడు తాజాగా 125సీసీ యాక్టివా స్కూటర్‌ను కూడా విక్రయించనుంది. హోండా యాక్టివా 125 స్కూటర్ రెండు వేరియంట్లలో (స్టాండర్డ్, డీలక్స్) లభ్యం కానుంది. హైదరాబాద్ మార్కెట్లో వాటి ధరలు ఇలా ఉన్నాయి:

* హోండా యాక్టివా 125 స్టాండర్డ్ - రూ.55,024
* హోండా యాక్టివా 125 డీలక్స్ - రూ.60,834
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


కొత్త హోండా యాక్టివా 125 ఇప్పటికే డీలర్ల వద్దకు చేరిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, కొందరు హోండా మోటార్‌సైకిల్ డీలర్లు యాక్టివా 125 కోసం రూ.5,000 అడ్వాన్స్ మొత్తాన్ని స్వీకరించి, బుకింగ్‌లను అంగీకరిస్తున్నారు.

హోండా యాక్టివా 125లో పవర్‌ఫుల్ 124సీసీ, ఫోర్-స్ట్రోక్, ఫోర్స్ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ 125సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6500 ఆర్‌పిఎమ్ వద్ద 8.6 హెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.12 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ రెగ్యులర్ వి-మ్యాటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

Honda Activa 125 Price Reveled

స్టాండర్డ్ వేరియంట్ యాక్టివా 125 అల్లాయ్ వీల్స్, డ్రమ్ బ్రేక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. అలాగే, డీలక్స్ వేరియంట్ హోండా యాక్టివా 125 అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్ ఆప్షన్లతో లభ్యం కానుంది. డీలక్స్ వేరియంట్లో 190 మి.మీ. డ్రమ్ బ్రేక్‌ను (ముందు వైపు మాత్రమే), స్టాండర్డ్ వేరియంట్లో 130 మి.మీ. డ్రమ్ బ్రేక్స్ (ఇరు వైపులా)ను ఉపయోగించారు. ఈ రెండు వేరియంట్లు కూడా హోండా యొక్క కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (సిబిఎస్)తో లభిస్తాయి.

యాక్టివా 125లో ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. దీని ఫలితంగా ముందు వైపు చక్రం 12 ఇంచ్‌లు మరియు వెనుక వైపు చక్రం 10 ఇంచ్‌ల పరిమాణానాన్ని కలిగి ఉంటుంది. హోండా యాక్టివా 125 స్కూటర్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, పెరల్ వైట్, మెటాలిక్ సిల్వర్ అనే రంగుల్లో లభిస్తుంది.

Most Read Articles

English summary
The wait is finally over! Honda two wheelers launches its first 125 cc Activa. Honda Motorcycle and Scooter India has now officially commenced bookings for the new 125cc scooter for the amount of Rs 5,000.
Story first published: Wednesday, April 23, 2014, 11:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X