భారతదేశపు నెంబర్ వన్ టూవీలర్ 'హోండా యాక్టివా'

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న పాపులర్ యాక్టివా స్కూటర్ మరోసారి దేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న నెంబర్ వన్ టూవీలర్‌గా నిలిచింది. గడచిన 11 నెలల వ్యవధిలో హోండా యాక్టివా మూడు సార్లు ఈ ఘనత దక్కించుకుంది.

ఇది కూడా చదవండి: యాక్టివా వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు ఉత్పత్తి పెంపు

భారతదేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న హీరో స్ప్లెండర్ అమ్మకాలను హోండా యాక్టివా మరోసారి బ్రేక్ చేసింది. జులై 2014 నెలలో హోండా మొత్తం 1,91,883 యాక్టివా స్కూటర్లను విక్రయించగా, ఇదే సమయంలో హీరో కేవలం 1,65,779 స్ప్లెండర్ బైక్‌లను మాత్రమే విక్రయించింది.

Honda Activa

హోండా యాక్టివా మొదట సెప్టెంబర్ 2013లో (యాక్టివా సేల్స్ 1,41,996 యూనిట్లు, స్ప్లెండర్ సేల్స్ 1,24,217 యూనిట్లు) ఆ తర్వాత మార్చ్ 2014లో (యాక్టివా సేల్స్ 1,77,928 యూనిట్లు, స్ప్లెండర్ సేల్స్ 1,63,778 యూనిట్లు) హీరో స్ప్లెండర్ అమ్మకాలను ఓవర్‌టేక్ చేసింది.

హోండా తొలిసారిగా తమ యాక్టివా స్కూటర్‌ను 2001లో పరిచయం చేసింది. ఈ 14 ఏళ్ల ప్రయాణంలో యాక్టివా అనేక మైలురాళ్లను అధిగమించిది. హోండా యాక్టివా కోసం ఇప్పటికీ వెయిటింగ్ పీరియడ్ ఉంటోందంటే, ఆ మోడల్‌కు ఉన్న డిమాండ్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. ప్రస్తుతం హోండా తమ యాక్టివా బ్రాండ్ క్రింద యాక్టివా, యాక్టివా ఐ అనే రెండు 110సీసీ స్కూటర్లను మరియు యాక్టివా 125 అనే ఓ 125సీసీ స్కూటర్‌ను అందిస్తోంది.

Most Read Articles

English summary
Honda Activa becomes the best selling two wheeler in India for the third time this July in the past 11 months. Keeping the upcoming festive season in mind, Honda is looking to cash in on this situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X