2014 ఎడిషన్ హోండా సిబి షైన్ విడుదల

By Ravi

జపనీస్ టూవీలర్ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న 125సీసీ బైక్ సిబి షైన్‌లో కొత్తగా 2014 ఎడిషన్ మోడళ్లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త 2014 ఎడిషన్ హోండా సిబి షైన్ ఇప్పుడు సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌తో రెండు ఆకర్షనీయమైన రంగులలో లభ్యం కానుంది.

ఇది కూడా చదవండి: హీరో ప్యాషన్ ప్రో టిఆర్ గురించి తెలుసా?

హోండా సిబి షైన్ భారతదేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న 125సీసీ బైక్. ఈ 2014 ఎడిషన్ సిబి షైన్‌లో కంపెనీ పెరప్ అమేజింగ్ వైట్, డ్యూయెల్ టోన్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది. ఈ రెండు కలర్స్ కాకుండా ఇది బ్లాక్, జెనీ గ్రే మెటాలిక్, రెబల్ రెడ్ మెటాలిక్ రంగుల్లో లభిస్తోంది.


ఆసక్తికరమైన విషయం ఏటంటే, ఈ కొత్త 2014 ఎడిషన్ హోండా సిబి షైన్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇదివరకటి ధరకే ఇది లభిస్తోంది. ఈ కొత్త మోడల్‌లో కేవలం కాస్మోటిక్ మార్పులు తప్ప ఇంజన్ పరంగా ఎలాంటి మార్పు లేదు.

ఇది కూడా చదవండి: సుజుకి లెట్స్ స్కూటర్ ఫీచర్లు

హోండా తొలిసారిగా 2006లో తమ సిబి షైన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటి వరకు సుమారు 30 లక్షలకు పైగా సిబి షైన్ మోటార్‌సైకిళ్లు అమ్ముడుపోయాయి. ఇది మూడు వేరియంట్లలో (కిక్ డ్రమ్ స్పోక్, సెల్ఫ్ డ్రమ్ అల్లాయ్, సెల్ఫ్ డిస్క్ అల్లాయ్) లభిస్తుంది.

CB Shine 2014

హోండా షైన్‌లో ప్రధాన ప్రత్యేకత జపనీస్ టెక్నాలజీతో రూపొందిన 125సీసీ ఆప్టిమ్యాక్స్ (OPTIMAX) ఇంజన్. ఆప్టిమ్యాక్స్ అంటే గరిష్ట పికప్, మైలేజ్ పొందటం కోసం కనిష్ట ఇంధనాన్ని వినియోగించుకోవటం (Optimum fuel input to Maximize pickup & mileage output) అని అర్థం. కంపెనీ ప్రతిపాదించిన దాని ప్రకారం, హోండా షైన్ లీటర్ పెట్రోల్‌కు గరిష్టంగా 65 కి.మీ. మైలేజీని ఇస్తుంది. హోండా షైన్ కేవలం 2.3 సెకండ్లలోనే 0.60 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఆప్టిమ్యాక్స్ ఇంజన్‌లో హోండా పొందుపరచిన అనేక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీల ద్వారా ఇది సాధ్యమవుతుంది.
Most Read Articles

English summary
Honda Motorcycle and Scooter India has introduced the latest style upgrade for CB Shine - India’s No.1 selling 125cc motorcycle. The refreshed CB Shine now comes in new standout graphics and 2 new colors - Pearl Amazing White and Dual Tone Red & Black.
Story first published: Wednesday, July 23, 2014, 18:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X