హోండా సిబిఆర్300ఆర్ స్పోర్ట్స్ బైక్ ఆవిష్కరణ

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా అందిస్తున్న సిబిఆర్ సిరీస్ స్పోర్ట్స్‌ బైక్‌లలో ఓ సరికొత్త వెర్షన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ మోటార్‌సైకిల్ వర్తక ప్రదర్శనలో (సిమామోటార్) హోండా తమ అధునాతన సిబిఆర్300ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను ప్రదర్శను ఉంచింది. ఈ హోండా సిబిఆర్300ఆర్ (Honda CBR300R) చైనా కోసం మాత్రమే డిజైన్ చేసిన ఎక్స్‌క్లూజివ్ మోడల్ కాదు.

ఈ ఫొటోల్లో కనిపిస్తున్న హోండా సిబిఆర్300ఆర్ స్పోర్ట్స్ బైక్ ఓ గ్లోబల్ మోడల్. అంటే, ఇది భారత్‌కు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ విపణిలో హై-ఎండ్ బైక్‌లకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, హోండా ప్రస్తుతం అందిస్తున్న 250సీసీ వెర్షన్ సిబిఆర్250ఆర్ స్థానంలో ఈ అధునాతన మరియు పవర్‌ఫుల్ 300సీసీ వెర్షన్ సిబిఆర్250ఆర్‌ను ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది.

హోండా సిబిఆర్300ఆర్‌ బైక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హోండా సిబిఆర్300ఆర్

హోండా సిబిఆర్300ఆర్

ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న సిబిఆర్250ఆర్ బైక్‌ను, హోండా తమ థాయ్‌లాండ్ ప్లాంటులో ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తుంది. అలాగే, ఈ కొత్త సిబిఆర్300ఆర్ బైక్‌ను కూడా ఇదే ప్లాంటులో ఉత్పత్తి చేసి, ఎగుమతి చేయనున్నారు.

సిబిఆర్300ఆర్

సిబిఆర్300ఆర్

హోండా ఇంకా ఈ కొత్త సిబిఆర్300ఆర్ బైక్‌కు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే, చూడటానికి మాత్రం హోండా సిబిఆర్250ఆర్, హోండా సిబిఆర్300ఆర్ బైక్‌లు రెండూ దాదాపు ఒకేవిధంగా ఉన్నట్లు అనిపిస్తాయి. (డిజైన్‌లో కొద్దిపాటి మార్పులు ఉన్నాయి).

హోండా సిబిఆర్250ఆర్

హోండా సిబిఆర్250ఆర్

ఈ ఫొటోలో మీరు చూస్తున్నది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హోండా సిబిఆర్250ఆర్ స్పోర్ట్స్ బైక్. హోండా నుంచి రానున్న సిబిఆర్300ఆర్ బైక్‌లో ఇదివరకటి 250సీసీ ఇంజన్‌ను రీట్యూన్ చేసి, డిస్‌ప్లేస్‌మెంట్‌ను అలాగే పెర్ఫామెన్స్‌ను పెంచి ఉపయోగించే ఆస్కారం ఉంది.

హోండా సిబిఆర్250ఆర్

హోండా సిబిఆర్250ఆర్

భారత్‌లో కొత్త హోండా సిబిఆర్300ఆర్ బైక్‌ను ప్రస్తుతం సిబిఆర్250ఆర్ ధరకే ఆఫర్ చేయగలిగినట్లయితే, ఇది మంచి ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Honda has unveiled the new CBR300R at the China International Motorcycle Trade Exhibition (CIMAMotor) in Chongqing, China. The CBR300R is not exclusive to China, but a global model. This means eventually it will make its way to India as well, where it is likely to replace the existing CBR250R.
Story first published: Friday, October 18, 2013, 11:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X