హోండా సిడి 110 డ్రీమ్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, మైలేజ్

By Ravi

జపాన్‌‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, భారత మార్కెట్లో తమ ఉత్పత్తులో కెల్లా అత్యంత చవకైన మోటార్‌సైకిల్ 'హోండా సిడి 110 డ్రీమ్' (Honda CD 110 Dream)ను ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసినదే.

దేశీయ విపణిలో దీని ధర కేవలం రూ.41,100 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మాత్రమే. హోండా నుంచి అత్యంత సరసమైన ధరకే మోటార్‌సైకిల్ ఇది. ఈ కథనంలో మనం హోండా అందిస్తున్న ఈ చీప్ అండ్ బెస్ట్ సిడి 110 డ్రీమ్ బైక్‌కు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‍‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‍‌‌లో పరిశీలించండి..!

ఇంజన్

ఇంజన్

హోండా సిడి 110 డ్రీమ్ మోటార్‌సైకిల్‌లో 110సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.25 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.63 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

హెచ్ఈటి

హెచ్ఈటి

హోండా సిడి 110 డ్రీమ్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ తాజాగా పరిచయం చేసిన హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి)తో అభివృద్ధి చేశారు. జపాన్, థాయ్‌లాండ్, మానేసర్ (ఇండియా)లలోని హోండా ఆర్ అండ్ డి సెంటర్లు సంయుక్తంగా ఈ ఇంజన్ టెక్నాలజీని అభివృద్ధి చేశాయి. ఈ టెక్నాలజీ వలన ఇంజన్ పవర్ ఏ మాత్రం తగ్గకుండా మెరుగైన మైలేజీని పొందటం సాధ్యమవుతుంది.

మైలేజ్

మైలేజ్

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, హోండా సిడి 110 డ్రీమ్ లీటరు పెట్రోల్‌కు 74 కిలోమీటర్ల (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజీని ఆఫర్ చేస్తుంది.

డిజైన్, ఫీచర్స్

డిజైన్, ఫీచర్స్

హోండా సిడి 110 డ్రీమ్ మోటార్‌సైకిల్ సింపుల్ లుక్‌ను కలిగి ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్‌పై సింపుల్ గ్రాఫిక్స్, బ్లాక్ కలర్ ఇంజన్, సిల్వర్ కోటెడ్ ఇంజన్ స్లీవ్స్, సిల్వర్ కలర్ అల్లాయ్ వీల్స్, మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ, ట్యూబ్‌లెస్ టైర్స్, విస్కౌస్ ఎయిర్ ఫిల్టర్, డ్రమ్ బ్రేక్స్ వంటి ఫీచర్లు ఈ బైక్ సొంతం.

వెడల్పాటి సీట్

వెడల్పాటి సీట్

రైడర్ మరియు పిలియన్ రైడర్లకు మంచి కంపర్ట్‌ను ఇచ్చేలా దీని సీటును వెడల్పుగా, పొడవుగా డిజైన్ చేశారు. సుధీర్ఘ ప్రయాణాల్లో సైతం సౌకర్యంగా ఉండేలా ఈ సీట్ ఉంటుందని కంపెనీ పేర్కొంది.

వీల్‌బేస్, గ్రౌండ్ క్లియరెన్స్

వీల్‌బేస్, గ్రౌండ్ క్లియరెన్స్

హోండా సిడి 110 డ్రీమ్ వీల్‌‌బీస్ 1258 మి.మీ. పొడవాటి వీల్‌బేస్ ఉండటం వలన అధిక వేగం వద్ద కూడా మంచి స్టెబిలిటీ లభిస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 179 మి.మీ. అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వలన ఇంజన్ రోడ్డుకు గుద్దుకునే ఆస్కారం తగ్గుతుంది.

కలర్ ఆప్షన్స్, వేరియంట్స్

కలర్ ఆప్షన్స్, వేరియంట్స్

హోండా సిడి 110 డ్రీమ్ బ్లాక్ విత్ రెడ్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రే స్ట్రైప్స్ అనే మూడు ఆకర్షనీయమైన రంగులలో లభ్యం కానుంది. ఇది కిక్/డ్రమ్/స్పోక్ వేరియంట్లలో లభ్యం కానుంది.

లభ్యత, ధర

లభ్యత, ధర

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తమ సిడి 110 డ్రీమ్ బైక్‌ను ఆగస్ట్ 2014 నాటికి మార్కెట్లో వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకురానుంది. దేశీయ విపణిలో దీని ధర కేవలం రూ.41,100 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు.

Most Read Articles

English summary
Honda two wheeler section in India had promised to get a more affordable motorcycle for the masses. The Japanese manufacturer has done exactly that by launching its new Dream CD 110 at an attractive price of INR 41,00 ex-showroom Delhi.
Story first published: Monday, July 7, 2014, 15:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X