డ్రీమ్ నియోలో కొత్త కలర్‌ను ప్రవేశపెట్టిన హోండా

By Ravi

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా గడచిన సంవత్సరం (2013) ఏప్రిల్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ బడ్జెట్ మోటార్‌సైకిల్ 'హోండా డ్రీమ్ నియో'లో కంపెనీ ఇప్పుడు ఓ కొత్త కలర్ ఆప్షన్‌ను పరిచయం చేసింది, కొత్త 2014 హోండా డ్రీమ్ నియో 110సీసీ మోటార్‌సైకిల్ ఇకపై వైట్ కలర్‌లో (రెడ్ గ్రాఫిక్స్‌తో) లభ్యం కానుంది. కాగా.. దీని ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

కొత్త 2014 హోండా డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ ధర రూ.42,237 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ కొత్త కలర్ కాకుండా హోండా డ్రీమ్ నియో మరో ఐదు రంగులలో (అమెజింగ్ వైట్, బ్లాక్ (వైలెట్ స్ట్రైప్స్), బ్లాక్ (రెడ్ స్ట్రైప్స్), ఆల్ఫా రెడ్, మాన్‌సూన్ గ్రే మెటాలిక్) లభిస్తుంది. కొత్త మోడల్‌లో ఇంజన్ పరంగా కూడా ఎలాంటి మార్పులు లేవు.

Honda Dream Neo

హోండా డ్రీమ్ నియోలో 109సీసీ, ఫోర్-స్ట్రోక్, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.25 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 74 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

హోండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం 'హోండా ఎకో టెక్నాలజీ' (హెచ్ఈటి)ని ఈ ఇంజన్‌లో ఉపయోగించారు. ఈ టెక్నాలజీలో మెరుగైన కంబస్టియన్, నికెల్ ప్లేటెడ్ స్పార్క్ ప్లగ్ వలన ఉత్పన్నమయ్యే క్లీన్ స్పార్క్ మరియు ఆప్టిమైజ్డ్ ఇన్‌లెట్ పోర్ట్‌లు ఉంటాయి. కార్బురేటర్ ద్వారా ఇంధన సరఫరా జరిగే ఈ ఇంజన్ గరిష్ట మైలేజీనివ్వటంలో సహకరిస్తుంది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది.

Most Read Articles

English summary
Honda Motorcycle and Scooter India has introduced a new color in Dream Neo. The 2014 edition of Dream Neo is now available in a new avatar in 'White color with elegant Red stripes' as an addition to its existing color line up. This value addition in styling shall be available without any additional cost.
Story first published: Thursday, September 4, 2014, 11:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X