పది లక్షల సేల్స్ మార్కును తాకిన హోండా డ్రీమ్ సిరీస్ బైక్‌లు

By Ravi

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా రెండేళ్ల క్రితం భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ డ్రీమ్ సిరీస్ బడ్జెట్ మోటార్‌సైకిళ్లు ఇప్పటికీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కేవలం 26 నెలల వ్యవధిలోనే 10 లక్షలకు పైగా హోండా డ్రీమ్ సిరీస్ మోటార్‌సైకిళ్లను విక్రయించినట్లు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) పేర్కొంది.

ఇది కూడా చదవండి: హోండా సిడి 110 డ్రీమ్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, మైలేజ్

గడచిన 2012 సంవత్సరంలో హోండా తొలిసారిగా 100-110సీసీ సెగ్మెంట్లో తమ డ్రీమ్ యుగ బైక్‌ను విడుదల చేసింది. ఆ తర్వాతి కాలంలో డ్రీమ్ నియో, తాజాగా సిడి 110 డ్రీమ్ అనే మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టింది. ఈ డ్రీమ్ సిరీస్ బైక్‌లను ప్రత్యేకించి మాస్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని సరసమైన ధరకే అందుబాటులో ఉండేలా కంపెనీ తీర్చిదిద్దింది.

Honda Dream

ఈ విజయంపై హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యద్‌విందర్ ఎస్ గులేరియా మాట్లాడుతూ.. గ్రామీణ భారతదేశంలో తాము విస్తరించుకున్న నెట్‌వర్క్ మరియు తాజాగా ప్రవేశపెట్టిన ఎంట్రీ లెవల్ బైక్ సిడి 110 డ్రీమ్ మోడళ్ల కారణంగా ఈ డ్రీమ్ సిరీస్ బైక్‌లు రానున్న రోజుల్లో మరింత ఎక్కువ వృద్ధిని కనబరచగలవని ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: 2014 ఎడిషన్ హోండా సిబి షైన్ విడుదల

కంపెనీ 2012లో హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి)తో తయారు చేసిన డ్రీమ్ యుగ బైక్‌కు ఇప్పటికీ మంచి స్పందన లభిస్తోంది. ఆ తర్వాత ఆగస్ట్ 2013లో ఈ సిరీస్‌లో విడుదల చేసిన మరో బైక్ డ్రీమ్ నియో కూడా మంచి సక్సెస్‌ను సాధించింది. ఇకపోతే, ఈ ఏడాది జులై నెలలో విడుదలైన సిడి 110 డ్రీమ్ అత్యంత చవక ధరకే లభిస్తుండటంతో కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు.

Most Read Articles

English summary
Honda Motorcycle & Scooter India (HMSI) has surpassed the 10 lakh sales mark for its Dream series mass motorcycles. Honda achived this milestone in just a span of 26 months.
Story first published: Thursday, August 7, 2014, 11:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X