కర్ణాటక ప్లాంట్‌లో హోండా సిబి షైన్ ఉత్పత్తి ప్రారంభం

By Ravi

ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) అందిస్తున్న పాపులర్ 125సీసీ బైక్ హోండా సిబి షైన్ మోడల్‌ను కర్ణాటక ప్లాంట్‌లో ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ మోడల్‌కు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, దీని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు గాను కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

హోండా ఇప్పటి వరకు సిబి షైన్ మోడల్‌ను కేవలం రాజస్థాన్‌లోని ప్లాంట్‌లో మాత్రమే ఉత్పత్తి చేస్తూ వస్తోంది. సిబి షైన్ విషయంలో ఓ క్రీయాశీలక నిర్ణయం తీసుకున్నామని, ఈ మోడల్ డిమాండ్‌కు అనుగుణంగా దీనిని బెంగుళూరు ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నామని హెచ్ఎమ్ఎస్ఐ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) వై ఎస్ గులెరియా తెలిపారు.

ఈ నిర్ణయంతో బెంగుళూరు ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న 4వ మోడల్‌గా సిబి షైన్ నిలిచింది. ఈ ప్లాంట్‌లో ఇప్పటికే డ్రీమ్ సిరీస్ మోటార్‌సైకిళ్లను, యాక్టివా స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్లాంట్ సామర్థ్యం సాలీనా 12 లక్షల యూనిట్లు.

CB Shine

హోండా సిబి షైన్ విషయానికి వస్తే.. విజేతల ఎంపిక (విన్నర్స్ ఛాయిస్) అనే ట్యాగ్‌లైన్‌ను కలిగి ఉన్న ఈ బైక్ నిజంగా విజేతల ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో ప్రధాన ప్రత్యేకత జపనీస్ టెక్నాలజీతో రూపొందిన 125సీసీ ఆప్టిమ్యాక్స్ (OPTIMAX) ఇంజన్. ఆప్టిమ్యాక్స్ అంటే గరిష్ట అవుట్‌పుట్ కోసం కనిష్ట ఇన్‌పుట్ (Optimum fuel input to Maximize pickup & mileage output)ని అందజేయటం అని అర్థం. సింపుల్‌గా చెప్పాలంటే, తక్కువ ఇంధనాన్ని గ్రహించి ఎక్కువ మైలేజ్, పవర్, పికప్‌లను అందించడం అన్నమాట.

కంపెనీ ప్రతిపాదించిన దాని ప్రకారం, హోండా షైన్ లీటర్ పెట్రోల్‌కు గరిష్టంగా 65 కి.మీ. మైలేజీని ఇస్తుంది. అయితే వాస్తవానికి ఇది డ్రైవింగ్ చేసే విధానం, గేర్లు మార్చే విధానం, నడిపే రోడ్లపై ఆధారపడి ఉంటుంది. సగటున ఇది సిటీ రోడ్లపై 50-55 కి.మీ. మైలేజీని, హైవే రోడ్లపై 55-60 కి.మీ. మైలేజీనిస్తుంది. హోండా షైన్ కేవలం 2.3 సెకండ్లలోనే 0.60 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఆప్టిమ్యాక్స్ ఇంజన్‌లో హోండా పొందుపరచిన అనేక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమవుతుంది. పవర్, మైలేజ్, పికప్, బడ్జెట్‌ను పరిగణిలోకి తీసుకునే వారికి హోండా షైన్ ఒక చక్కటి ఆప్షన్‌గా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Two-wheeler manufacturer Honda Motorcycle & Scooter India (HMSI) is revamping its Karnataka facility, from where it plans to roll out the 125-cc motorcycle CB Shine amid rising demand for the model.
Story first published: Wednesday, January 15, 2014, 16:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X